'ఆర్ఆర్ఆర్' సినిమా నిడివి ఎంత? మూడు గంటల ఆరు నిమిషాల యాభై నాలుగు సెకన్లు! ఫస్ట్ టైమ్ సెన్సార్ చేయించినప్పుడు నిడివి అంతే! మరి, ఇప్పుడు? ఐదు నిమిషాల ఒక సెకన్ తగ్గింది. అవును... 'ఆర్ఆర్ఆర్' నిడివి తగ్గించారు. సినిమా నిడివిని మూడు గంటల రెండు నిమిషాలకు కుదించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే... డిలీట్ చేసిన సన్నివేశాల్లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర గొప్పదనం గురించి చెప్పే డైలాగ్ ఒకటి ఉందని తెలుస్తోంది.


సెన్సార్ చేయించిన తర్వాత మళ్ళీ నిడివి తగ్గించాలని అనుకున్నా... పెంచాలని అనుకున్నా... ఆల్రెడీ ఉన్న సీన్లు తొలగించి కొత్త సీన్లు యాడ్ చేయాలనుకున్నా... సెన్సార్ బోర్డుకు తెలియజేయాలి. 'ఆర్ఆర్ఆర్' టీమ్ స్వచ్ఛందంగా మూడు సీన్లు డిలీట్ చేసింది. అందులో ఒకటి థాంక్స్ కార్డ్స్‌లో 20 సెకన్స్. ఇంకొకటి... కొమురం భీమ్ పాత్ర గురించి చెప్పే డైలాగ్ అని టాక్. 'అది భారతదేశపు...' అంటూ వచ్చే 1.36 మినిట్స్ డైలాగ్ డిలీట్ చేశారు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత వచ్చే ఎండ్ క్రెడిట్స్‌లో 3.05 మినిట్స్ విజువల్స్ కూడా డిలీట్ చేశారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ డిలీట్ చేయడం ఆయనకు ఫ్యాన్స్‌కు ఒక విధంగా బాడ్ న్యూస్ అని చెప్పాలి.


Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. డీవీవీ దానయ్య నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' - ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ లుక్ వచ్చింది! చూశారా?