Roshan Meka's Champion Movie Teaser Out : సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్'. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ హైప్ క్రియేట్ చేయగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆ హైప్ పదింతలు చేసింది. ఫుట్ బాల్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కగా... బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ ఆసక్తిని పెంచేసింది.

Continues below advertisement

టీజర్ ఎలా ఉందంటే?

బ్రిటిష్ కాలం నాటి యుద్ధ పరిస్థితులు... గ్రౌండ్‌లో చుట్టూ సైనికుల హాహాకారాలు... మధ్యలో బాల్‌తో యోధుడిలా హీరో... ఇదీ 'ఛాంపియన్' బ్యాక్ డ్రాప్. 'ఒక్కడినే సెంటర్‌కు వెళ్లి బాల్ తీస్కపోయి గోల్ కొడతా. ఏ ప్లేయర్ నన్ను అడ్డుకునే సాహసం చేయడు.' అంటూ రోషన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'మైఖేల్ సి విలియమ్స్' పాత్రలో ఓ ఫుట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించనున్నారు. 

Continues below advertisement

అసలు బ్రిటిష్ సైన్యానికి ఫుట్ బాల్‌కు సంబంధం ఏంటి? ఓ ఫుట్ బాల్ ప్లేయర్ గన్ చేతబట్టి ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అనే సస్పెన్స్‌ను టీజర్‌లో చూపించారు. మూవీ టీజర్ చూస్తుంటే 'లగాన్' సినిమాకు కాస్త కనెక్ట్ అయ్యేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read : 'విజయ్'ది మాత్రమే తప్పు కాదు - కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ అజిత్ రియాక్షన్

మూవీలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. టీజర్‌లో రోషన్ విమానం నుంచి సూపర్ హీరో లుక్‌లో దిగడం, సెకండ్ క్వీన్ ఎలిజిబెత్ ఎంట్రీ వేరే లెవల్‌లో ఉండగా స్టోరీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా... స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తి కాగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

2016లో 'నిర్మలా కాన్వెంట్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రోషన్. ఆ తర్వాత 'పెళ్లి సందD'లో నటించారు. ప్రస్తుతం డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'వృషభ'లోనూ కీలక పాత్ర పోషించారు.