Roja is busy with Tamil movies and TV shows:  మాజీ మంత్రి రోజా  12 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు.  తమిళ సినిమా 'లెనిన్ పాండియన్'లో 'సంతానం' పాత్రలో నటిస్తున్నారు. ఈ మేరకు ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రోజాకు ప్రభుదేవా, ఖుష్బూ శుభాకాంక్షలు తెలిపారు.  

Continues below advertisement

 'లెనిన్ పాండియన్' ఒక ఫ్యామిలీ డ్రామా-ఎమోషనల్ స్టోరీగా రూపొందుతోంది. డైరెక్టర్ బాలచంద్రన్  తమిళ సినిమాల్లో 'విజయ్ సేతుపతి', 'అజిత్' చిత్రాలకు సహాయక డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు  రోజా పాత్ర 'సంతానం' ఒక బలమైన మహిళా క్యారెక్టర్, కుటుంబ సంక్షోభాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వీడియో బట్టి  అర్థం చేసుకోవచ్చు.   

Continues below advertisement

నగరి నుంచి రెండు సార్లు గెలిచిన రోజా.. కొంత కాలం మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె తన పాత రంగంపై దృష్టి పెట్టారు. మెల్లగా టీవీషోలు.. సినిమాల వైపు వెళ్తున్నారు.   'జీ తెలుగు సూపర్ సీరియల్ చాంపియన్‌షిప్ సీజన్ 4'  అనే రియాలిటీ షోలో జడ్జ్‌గా  వ్యవహరించారు. తమిళంలోనూ కొన్ని టీవీ షోలు చేశారు.   

రోజా 90లో సూపర్ గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. తమిళంలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త సెల్వమణి కూడా ప్రముఖ దర్శకుడే.  ఏపీలో కన్నాతమిళంలో అయితే మంచిదని అక్కడే రీఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.                           

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెేచ్చుకున్న రోజా ఇటీవలికాలంలో పెద్దగా స్పందించడం లేదు.  ఆమె సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.  అయితే అడపాదడపా ఆమె నగరిలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు  ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది.  సప్టెంబర్ లోనే దీనిపై నివేదిక వచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో ఆమె సినిమాల్లో నటిస్తున్నారని.. మళ్లీ ఎన్నికల సమయంలోతనదైన ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.