Ramayanam Producers Yash, Namit Malhotra Share Exciting Details: బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారి అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా 'రామయణం' తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సౌత్‌ బ్యూటీ సాయి పల్లవి నటించబోతున్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు, ఈ మూవీ రావడం మాత్రం కన్‌ఫాం. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాడు నితీష్‌ తివారి. అయితే ఇంకా ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాకుండానే ఈ సినిమాకు సంబంధించి రోజుకో పుకారు షికారు చేస్తుంది.


ఇక ఇందులో కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అందులో నిజం లేదని తెలింది. ఈ ప్రాజెక్ట్‌లో  భాగమవుతున్న మాట వాస్తవమే కానీ, సినిమాలో నటించడం లేదట. ఏకంగా ఈ సినిమానే నిర్మిస్తున్నారట. అవును ఈ మూవీ నిర్మాతల్లో యస్‌ ఒకడిగా ఉన్నాడు. మిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి యష్‌ తన సొంత బ్యానర్‌ మాస్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌లో 'రామాయణం' నిర్మించబోతున్నాడు. తాజాగా దీనిపై ఆఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చింది. మూవీ ఈవెంట్‌లో ఈ విషయాన్ని తేల్చేసింది 'రామాయణం' టీం. 


తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నమిత్ మల్హోత్రా, యష్‌లు 'రామయణం' సినిమాను కలిసి నిర్మించబోతున్నట్టు స్పషం చేశారు. ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. "యూకే, యూఎస్‌, భారత్‌ వంటి దేశాల్లో వ్యాపారాలు చేశాను. ఎన్నో విజయాలు అందుకుని ఆస్కార్ వరుకు వెళ్లాను. ఈ నా కెరీర్‌లో మన దేశ ప్రగతిని, పురాణాలను చాటి చెప్పే రామయాణాన్ని తెరకెక్కించే అవకాశం రావడం గొప్ప అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. అప్పుడే ఈ నా సక్సెస్‌ పూర్తవుతుంది. ఇక ఎక్కడో కర్ణాటక నుండి ఈరోజు ప్రపంచం గర్వించే కేజీయఫ్‌ వరకు యష్‌ చాలా కష్టపడ్డారు.ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ను ప్రపంచ వేదిక మీద ప్రజెంట్ చెయ్యాలంటే అది యష్ లాంటి వారితోనే సాధ్యం" అంటూ చెప్పుకొచ్చాడు. 


ఇక హీరో యష్‌ మాట్లాడుతూ.. "మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలనేది నా చిరకాల కల. ఇక రామాయణం చిత్రాన్ని నేను నమిత్‌ కలిసి చేస్తే  బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియడమనేది సాధారణ విషయం కాదు. బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను సహా నిర్మాతగా మూవీని ప్రొడ్యూస్‌ చేయాలకున్నాను.  రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఇంటర్నేషనల్‌ స్టేజ్‌పై ఈ చిత్రంతో ప్రేక్షకులకి ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకు నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు" అని పేర్కొన్నాడు. కాగా రామాయణం కోసం యష్‌ సుమారు రూ. 80 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.