Riteish Wishes to Genelia on Her Birthday: "అంతేనా... వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ" అనే ఒక్క డైలాగ్‌ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది క్యూట్‌ బ్యూటీ జెనీలియా. బొమ్మరిల్లులో ఆమె పోషించిన హాసిని పాత్ర విశేష ప్రేక్షకాదరణ పొందింది. హా..హా హసిని అంటూ ఆమె చెప్పిన క్యూట్‌ డైలాగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అంతగా తన నటన, క్యూట్‌ డైలాగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జెనీలియా బర్త్‌డే డే. ఈ సందర్భంగా ఆమెకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.


హ్యాపీ బర్త్ డే బైకో


అలాగే జెన్నీకి ఆమె భర్త, బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. నిజంగా నువ్వు నా జీవితాన్నే మార్చేశాడు అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. భార్యకు బర్త్‌డే సందర్భంగా ఓ జెనిలియాతో కలిసి ఓ వీడియో షేర్‌ చేశాడు. పెళ్లికి ముందు భర్త ప్రేమ అంటూ జెన్నీలియాతో రొమాంటిక్‌ సాంగ్‌కి రీల్‌ చేశారు. ఆ తర్వాత పెళ్లి తర్వాత భర్త ప్రేమ అంటూ జెన్నీలియా కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి రెండు కలిసి ఏడిట్‌ చేసి షేర్‌ చేశాడు. దీనికి "హ్యాపీ బర్త్‌డే బైకో.. నువ్వు నిజంగా నా లైఫ్‌ని మార్చేశాడు" అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం రితేష్‌ తన భార్య జెన్నీలియాకు బర్త్‌డే చెప్పిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.






ఆకట్టుకుంటున్న వీడియో


ఎంత క్యూట్‌గా విషెస్‌ చెప్పాడు, క్యూట్‌ కపుల్‌ అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం బర్త్‌డే విషెస్‌ ఇలా కూడా చెప్పోచ్చా! అని సర్ప్రైజ్ అవుతున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోగా ఆకట్టుకుంటుంది. కాగా జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లది లవ్‌ మ్యారేజ్‌ అనే విషయం తెలిసిందే. కెరీర్‌ ఫుల్‌ స్వీంగ్‌లో ఉండగానే రితేష్‌‌ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది. అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పటి తమ ఇద్దరు కుమారుల బాధ్యత, ఇంటి పనులను చూసుకున్న జెన్నీలియా మళ్లీ తన కెరీర్‌ని రిస్టార్ట్‌ చేసింది. వేద్‌ సినిమాతో లాంగ్‌ గ్యాప్‌తో రీఎంట్రీ ఇచ్చింది. మజిలి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.



రీఎంట్రీలోనూ మళ్లీ భర్త రితేష్‌తోనే జతకట్టింది. కాగా జెనీలియా 'తుజే మేరీ కసమ్‌' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరో. డెబ్యూ మూవీతోనే రితేష్‌ జతకట్టింది. అదే మూవీ టైంలో ఇద్దరికి తొలి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారి.. ప్రేమ వరకు వెళ్లింది. అయితే మొదట తమ ప్రేమకు వ్యక్తం పరచుకోడానికి చాలా టైం తీసుకున్న ఈ కపుల్స్‌.. తొమ్మిదేళ్లు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో  2012 ఫిబ్రవరి 3న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు సంతానం. 


Also Read: రితేష్‌తో జెనీలియా ప్రేమ ఎలా మొదలైందో తెలుసా? - అచ్చం తమ తొలి మూవీ స్టోరీనే.. వీరి ప్రేమకథ..!