తెలుగు సినిమాల్లో నటించి, స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న తర్వాత... ఈ ఇమేజ్ చూపించి హిందీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన అందాల భామలు ఎంతో మంది ఉన్నారు. హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తెలుగు లేదా తమిళ్... సౌత్ ఇండస్ట్రీలపై కామెంట్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. కానీ, కాజల్ అగర్వాల్ అలా కాదు. బాలీవుడ్ మీడియా ముందు బాలీవుడ్ మీద భారీ పంచ్ డైలాగ్స్ వేశారు. డైరెక్టుగా హిందీ ఇండస్ట్రీలో వేల్యూస్ లేవని చెప్పేశారు.


హిందీ మాతృభాషే కానీ...
బాలీవుడ్‌లో విలువలు ఎక్కడ?
ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ పార్టిసిపేట్ చేశారు. సౌత్ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ గురించి మాట్లాడారు. ''హిందీ మన మాతృభాష. నేను హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. హిందీ సినిమా ఇండస్ట్రీ నన్ను ఆదరించింది. కానీ, నేను సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ, విలువలు, అక్కడ పద్ధతులను ఇష్టపడతాను'' అని కాజల్ అగర్వాల్ తెలిపారు. 


సౌత్ ఫ్రెండ్లీ ఇండస్ట్రీ - కాజల్!
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... దక్షిణాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన దర్శకులు, సాంకేతిక నిపుణులు ఉన్నారని కాజల్ అగర్వాల్ తెలిపారు. సౌత్ నుంచి అద్భుతమైన కంటెంట్ వస్తుందని చెప్పారు. సౌత్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని, దక్షిణాది పరిశ్రమలో షార్ట్ కట్స్ ఏమీ ఉండవని కాజల్ పేర్కొన్నారు. విజయానికి దగ్గర దారులు ఉండవని ఆమె స్పష్టం చేశారు.


''హిందీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేయాలని చాలా మంది భావిస్తారు. ఎందుకంటే... హిందీ దేశభాష. దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అయితే, సౌత్ నుంచి వండర్ ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు'' అని నార్త్, సౌత్ మధ్య డిఫరెన్స్ గురించి కాజల్ వివరించారు. 


హైదరాబాద్, చెన్నై అంటే హోమ్!
తాను బొంబాయిలో పుట్టి పెరిగినప్పటికీ... తన కెరీర్ హైదరాబాదులో మొదలు అయ్యిందని ఢిల్లీలో కాజల్ అగర్వాల్ వివరించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు తెరకు ఆమె పరిచయం అయ్యారు. ''నేను ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేశా. అలాగే, కొన్ని హిందీ సినిమాలు కూడా చేశా. నాకు అయితే హైదరాబాద్, చెన్నైలో ఉంటే ఇంటిలో ఉన్నట్టు ఉంటుంది'' అని కాజల్ చెప్పారు.  


Also Read : తెలంగాణలో చిరు, బాలయ్య సినిమాలను దాటేసిన 'దసరా' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?


వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అబ్బాయి నీల్ కిచ్లూ పుట్టిన తర్వాత అతడికి ఎక్కువ సమయం కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఇండియన్ 2'లో నటిస్తున్నారు. 


తెలుగులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ కథానాయిక. పెళ్లి తర్వాత తెలుగులో ఆమెకు రీ ఎంట్రీ చిత్రమిది. నిజం చెప్పాలంటే... మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో ఆమె నటించారు. అయితే, విడుదలైన సినిమా చూస్తే కాజల్ ఉండరు. ఆమె సన్నివేశాలకు కత్తెర వేశారు. 


Also Read విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?