Rishab Shetty's Kantara Chapter 1 Trailer Out: 2022లో చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించింది 'కాంతార'. పుంజుర్లి దేవుడికి సంబంధించిన చరిత్రతో పాటు జానపదం కలిపి అద్భుతంగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.
పూర్వీకుల కథ వెనుక కథ
ఫస్ట్ పార్ట్‌లో పుంజుర్లి దేవుని అవతారంలో ఓ చోట నుంచి మాయం కాగా... అసలు అక్కడి నుంచి ఏం జరిగిందనేది... పుంజుర్లి దేవుని చరిత్ర... దాని వెనుక ఉన్న పురాణ కథనం అన్నింటినీ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. తన తండ్రి 'పుంజుర్లి' అవతారంలో మాయమైన చోటుకు వచ్చిన కొడుకు... 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?' అన్న కొడుకు ప్రశ్నతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గ్రామ మొత్తం తన తండ్రి కోసం వెతుకుతుండగా... 'ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే అదో పెద్ద దంత కథ.' అంటూ గతంలోకి తీసుకెళ్లి భారీ హైప్ క్రియేట్ చేశారు.
'కాంతార'లోకి వెళ్లొద్దు... ఎందుకంటే?
ఏళ్లి క్రితం అనగనగా ఓ రాజ్యం... ఆ రాజ్యాన్ని ఆనుకుని ఉన్న తెగ. ఆ తెగను అణచివేయాలని చూసే రాజు. ఆ తెగకు అండగా ఉండే నాయకుడు... దైవ శక్తి సహాయంతో ధర్మాన్ని ఎలా గెలిపించాడు? అనేదే మూవీ స్టోరీ అన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు. అన్నీ గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే...' అన్న డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది.
పులి కాపలాగా దైవాంశతో అడవి తెగకు దొరికిన బిడ్డ... 'బెర్మె' అంటూ ముద్దుగా పేరు పెట్టుకుని పెంచుకున్న అక్కడి ప్రజలు. చివరకు వారికి ఎలా అండగా నిలిచాడు అనేది కూడా ట్రైలర్‌లో చూపించారు. తాము పండించినది కప్పం కట్టాలంటూ హింసించే రాజుకు ఎదురు తిరిగిన 'బెర్మె' రాజును ఎలా ఎదిరించాడు? యువరాణి తెగ నాయకున్ని ఇష్టపడడంతో రాజు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? తెగకు రాజుకు మధ్య జరిగే యుద్ధానికి, 'కాంతార'కు సంబంధం ఏంటి? అసలు పుంజుర్లి దేవుని చరిత్ర ఏంటి? గుళిగ కథ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందనేలా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కొన్ని సన్నివేశాల్లో రిషబ్ లుక్, పుంజుర్లి అవతారం ఎలివేషన్ వేరే లెవల్‌లో ఉంది.
Also Read: పీఎం మోదీ బయోపిక్ - 'మా వందే' నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్... ఉన్ని ముకుందన్ బర్త్ డే స్పెషల్
అక్టోబర్ 2న రిలీజ్
రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో మూవీ తెరకెక్కించగా... ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.