Radhika Sarath Kumar Mother Geetha Passes Away: సీనియర్ హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి, దివంగత సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధా భార్య గీత ఆదివారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. గీత మృతితో రాధికా ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ, సామాజిక వర్గాల కోసం గీత ఎంతగానో కృషి చేశారు.

సోమవారం సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాధికా కుటుంబ సభ్యులు తెలిపారు. దివంగత నటుడు ఎం.ఆర్ రాధా వారసత్వాన్ని గీత కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతాల్లో అనేక సామాజిక సేవల్లో ఆమె పాల్గొన్నారు. తనకు తోచిన సాయం అందిస్తూ వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.