Rishab Shetty's Kantara Chapter 1 Boycott Trending Gone Viral: రిలీజ్‌కు రెండు రోజుల ముందు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1'కు షాక్ తగిలింది. తెలుగు నెటిజన్లు సడన్‌గా సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ కాంతార చాప్టర్ 1' అంటూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడడం వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రంలో తెలుగులో మాట్లాడలేదని... మన భాషను చులకన చేశారంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. తెలుగు చిత్రాలను కర్ణాటకలో ఆడనివ్వడం లేదని... పోస్టర్లపై నల్ల రంగు పూశారని అంటున్నారు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీకి కూడా కర్ణాటకలోని థియేటర్ల వద్ద ఇబ్బందులు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
'బాయ్ కాట్' చేయండి
గతంలో మన తెలుగు సినిమాలను కర్ణాటకలో ఆడనివ్వలేదని... కొన్ని తెలుగు సినిమా టైటిల్స్‌కు పోస్టర్స్‌లో నల్ల రంగు పూశారంటూ సదరు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉండాల్సిన టైం వచ్చిందని మన సత్తా చూపించాలి అంటూ... 'కాంతార చాప్టర్ 1' బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
మన హీరోల సినిమాలను వారు చులకనగా చూస్తూ... కనీసం థియేటర్ల వద్ద పోస్టర్లు కూడా పెట్టనివ్వ లేదని అలాంటప్పుడు వారి సినిమాలను ఇక్కడ ఎందుకు ఆదరించాలని ప్రశ్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రిషబ్ కనీసం తెలుగులో మాట్లాడలేదని... మన భాష అంటే అంత చులకన ఏంటీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరు కావడంపైనా విమర్శలు చేస్తున్నారు. మరి ఇది మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూాడాల్సి ఉంది. మూవీ టీం సైతం రియాక్ట్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.
2022లో వచ్చిన 'కాంతార' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కించారు. మూవీకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా... రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.