Rishab Shetty Birthday: కన్నడ కథానాయకుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు ఇవాళ (జూలై 7). ఈ సందర్భంగా 'కాంతార: ఏ లెజెండ్' (Kantara A Legend Chapter 1) చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది.‌ వరాహస్వామి గర్జిస్తే ఎలా ఉంటుందో... కొత్త పోస్టర్‌లో అంత వీరోచితంగా రిషబ్ శెట్టి కనిపించారు. అంతే కాదు... ఈ సినిమా విడుదల తేదీని మరొకసారి కన్ఫర్మ్ చేశారు. 

'కాంతార: ఏ‌ లెజెండ్'లో రిషబ్ శెట్టి...అసలు సిసలైన ఫస్ట్ లుక్ ఇదేనని‌ చెప్పాలి!'కాంతార‌' సినిమా చేసినప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ఆలోచన రిషబ్ శెట్టిలో లేదు. ఆ చిత్రాన్ని తొలుత కన్నడలో విడుదల చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోనూ భారీ విజయం సాధించింది. దాంతో 'కాంతార' ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు‌. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదల అయింది. అయితే అందులో రిషబ్ శెట్టి రూపాన్ని పూర్తిగా చూపించలేదు.‌ ఈ‌ రోజు రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ అసలు సిసలైన ఫస్ట్ లుక్ అని చెప్పాలి.

Also Readకాంట్రవర్సీలు ఫుల్... కలెక్షన్లు నిల్... లైలా to తమ్ముడు... బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ ఉందా?

ఏడు భాషల్లో కాంతార ప్రీక్వెల్...ఇంగ్లీష్, బెంగాలీలోనూ సినిమా రిలీజ్!Kantara prequel release date: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'కాంతార' ప్రీక్వెల్ విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు మరొకసారి విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది. పాన్ ఇండియా రిలీజ్ కాదు... కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్, బెంగాలీలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కన్నడ ఇండస్ట్రీ వరకు బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పాలి. 

Also Read: తమిళ దర్శకుడితో ప్రభాస్ సినిమా... బ్యాక్ టు బ్యాక్ పోలీస్ కథలతో!?

'కాంతార' ప్రీక్వెల్ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యష్ 'కేజీఎఫ్'తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాలను ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.