RGV - Animal in vyuham promotions: 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాంట్లో భాగంగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన. అనుకున్నది అనుకున్నట్లు, చెప్పాలి అనిపించింది నిర్మొహమాటంగా చెప్పేస్తారు ఆర్జీవి. అలా 'యానిమల్' సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. 'యానిమల్' సినిమాలో తెలుగు హీరోగా ఎవరుచేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఆ హీరో సూట్ అవుతాడు..
'యానిమల్' సినిమా రిలీజైనప్పుడు చాలామంది దానిపై నెగటివ్ గా స్పందించారు. కొంతమంది సినిమా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు. ఇక పొగిడిన వాళ్ల జాబితాలో ముందు ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. 'యానిమల్' సినిమా గురించి వరుస ట్వీట్లు చేశారు ఆయన. " 'యానిమల్' ఎక్కడ, ఎలా కనెక్ట్ అయ్యింది?" అని ప్రశ్నించగా ఇలా జవాబు ఇచ్చారు ఆర్జీవి. "ట్రెడిషనల్ టెంప్లేట్స్ బ్రేక్ చేశాడు సందీప్ వంగ. స్టోరీ నెరేషన్ స్ట్రక్చర్, హీరో అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, సినిమా ఇన్ని గంటలే ఉండాలి అనే బ్యారియర్స్ ని బ్రేక్ చేశాడు సందీప్. అందుకే, నాకు చాలా నచ్చింది" అని అన్నారు. "తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది?" అని అంటే విజయదేవరకొండ పేరు చెప్పారు ఆర్జీవి. ఈ టాలీవుడ్ హీరోల్లో ఈ స్క్రిప్ట్ కి సూట్ అయ్యేది విజయ్ దేవరకొండకే అని తన మనసులో మాట బయటపెట్టారు ఆర్జీవి. గతంలో సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చింది. అది కూడా బోల్డ్ కంటెంట్.
రణ్ బీర్ కపూర్, రష్మిక మందన నటించిన 'యానిమల్'ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్, సినిమా ఎక్కువసేపు ఉండటం, వాయలెన్స్ తదితర అంశాలు కొందరికి నచ్చలేదు. దానిపై తీవ్ర విమర్శలు చేశారు చాలామంది. కానీ, కొంతమంది మాత్రం ఈ సినిమాను పొగిడారు. కథ, హీరో యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. దాంట్లో ఒకరు ఆర్జీవి. ఆయన ప్రతి విషయాన్నిట్విట్టర్ ద్వారా ఎక్కువగా రెస్పాండ్ అవుతారనే విషయం తెలిసిందే. అలా... 'యానిమల్' పై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.
ఇక 'వ్యూహం' సినిమా విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయా పరిస్థితులు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్న పరిస్థితులను చెప్తూ తీశారు ఈసినిమాని. ప్రతిపక్షాలనుత టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఎన్నో వాయిదాలు, కోర్టు స్టే తర్వాత ఫిబ్రవరి 23 ఫిబ్రవరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం కావడంతో ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. విడుదలైతే ఓటర్లపై ప్రభావం పడుతుందని హైకోర్టు కూడా దీనిని నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఫైనల్‌గా తన మాట నెగ్గేలా చేసుకొని ‘వ్యూహం’ను విడుదలకు సిద్ధం చేశాడు వర్మ. ‘వ్యూహం’ సినిమాని నిలిపేయాలని, దాంట్లో తనను కించపరిచేలా సీన్లు ఉన్నాయని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోర్టులో పిటషన్ వేశారు. దానిపై విచారించిన కోర్టు విడుదలపై స్టే విధించింది. ఇక సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Also Read: మేం ఏం ద్రోహం చేశాం.. కన్నీళ్లు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్