Renuka Swamy Murder Case: సినీ పరిశ్రమలో ఒక స్టార్ హీరోపై మర్డర్ కేసు ఫైల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరో అయిన దర్శన్‌ను మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో దర్శన్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా అసలు ఏం జరిగింది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అందులో చాలామంది దర్శన్ ఇలా చేసి ఉండడని తనకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదే నిజమే అయ్యిండవచ్చని నమ్ముతున్నారు. అసలు విషయం ఇదే అంటూ కన్నడ మీడియాలో ఒక కథనం ప్రచారం అవుతోంది.


ఆమె కోసమే..


రేణుకా స్వామి అనే వ్యక్తికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. అతడు పంపిన ఒక అసభ్యకరమైన మెసేజ్ తన హత్యకు దారి తీసిందని కన్నడ మీడియా అంటోంది. అయితే ఆ మెసేజ్ ఏంటి అనే విషయంపై శాండిల్‌వుడ్‌లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మర్డర్ కేసులో కీలకంగా మరో సినీ సెలబ్రిటీ కూడా ఉందని తెలుస్తోంది. తనే పవిత్ర గౌడ. పలు కన్నడ సినిమాల్లో నటిగా మెరిసిన పవిత్ర గౌడ వల్లే ఈ రేణుకా స్వామి హత్యకు గురయ్యాడని శాండిల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో తను, దర్శన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారట పవిత్ర గౌడ. దర్శన్‌కు చాలాకాలం క్రితమే విజయలక్ష్మితో పెళ్లయ్యింది.


అసభ్యకర మెసేజ్‌లు..


పవిత్ర గౌడతో దర్శన్ రిలేషన్‌షిప్‌ను ఒక అభిమానిగా రేణుకా స్వామి యాక్సెప్ట్ చేయలేకపోయాడని తెలిసింది. అందుకే అప్పటినుంచి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం ప్రారంభించినట్టు సమాచారం. పవిత్ర గౌడకు మాత్రమే కాకుండా దర్శన్‌కు కూడా తను అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడట. గత శుక్రవారం తన ప్రైవేట్ పార్ట్స్‌ను ఫోటో తీసి ‘‘నేను నీకంటే తక్కువేమీ కాదు’’ అంటూ దర్శన్‌కు పంపించాడట రేణుకా స్వామి. దీనివల్ల పవిత్ర గౌడ, దర్శన్‌.. ఇద్దరూ సహనం కోల్పోయారని... దర్శన్ పెద్ద స్టార్ కావడంతో వారు నేరుగా హత్య చేయలేమని భావించి తన ఇంట్లో పనిచేసే పవన్‌‌తో కలిసి ఈ ప్లాన్ చేశారని సమాచారం.


అమ్మాయి గొంతుతో మాట్లాడి..


పవన్‌ను ఈ మర్డర్‌లో సాయం చేయమని పవిత్ర కోరిన తర్వాత ఈ విషయాన్ని దర్శన్‌కు వెళ్లి చెప్పేశాడట పవన్. అప్పుడే దర్శన్ కూడా ఇందులో భాగమవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. తనతో పనిచేసే వ్యక్తికి చెప్పి చిత్రదుర్గ ఏరియా నుంచి రేణుకా స్వామిని దర్శన్ కిడ్నాప్ చేయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం తన ఫ్యాన్స్ అసోసియేషన్‌లోని ఒక వ్యక్తి.. తన గొంతు మార్చి అమ్మాయిగా మాట్లాడి రేణుకా స్వామిని ఇంటి నుంచి బయటికి రప్పించారట. ఆ తర్వాత కామాక్షి ప్రియాలోని ఒక గోడౌన్‌లో రేణుకా స్వామిని శారీరకంగా హింసించడంతో తను మృతి చెందాడని తెలుస్తోంది. దీంతో దర్శన్, పవిత్రతో పాటు మరో 11 మందిని రిమాండ్‌లో ఉంచమని ఆదేశించింది బెంగుళూరు కోర్టు.


Also Read: ఈమె జస్ట్ అలా కూర్చున్నందుకు రూ.8 కోట్లు ఇస్తున్నారట - ఈ సీనియర్ నటి సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు