Actress Renu Desai : ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) రీసెంట్ గా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageshwararao) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రేణు దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్(Renu Desai) తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


"నేను ఏదైనా చాలా సూటిగా మాట్లాడుతాను. చాలా ఓపెన్ గా ఉంటాను. మీరు నాకు ఏదైనా చెబితే అది నాకు మంచిగా అనిపిస్తే కచ్చితంగా మీరు చెప్పింది వెంటనే వింటాను. కానీ చెప్పే విధానం కూడా ఉండాలి. నా వెనకాల నా గురించి మాట్లాడే వారిని నేను కంట్రోల్ లో పెట్టలేను. మనం 2023లో ఉన్నాం. అయినా కూడా మహిళలకు ప్రాధాన్యత లేదు. ఏ ఫీల్డ్ లో అయినా ఫిమేల్ బాస్ ఉన్నారంటే కొంచెం నెగిటివిటీ అనేది ఉంటుంది. ఇది నేను చాలాసార్లు చూశాను. ఆడవాళ్లు ఏదైనా చెప్తే దాన్ని లైట్ తీసుకుంటారు. నస అనుకుంటారు. ఇప్పుడు ఓ ప్రొడ్యూసర్ గా ఓ డైరెక్టర్ గా నా గురించి బయట వాళ్ళు నెగటివ్ గా మాట్లాడడం చాలా ఈజీ. అదే మేల్ డైరెక్టర్స్ తమ అసిస్టెన్స్ పై అరిచినా, కోప్పడ్డా వాళ్ల నుంచి చిన్న మాట కూడా రాదు. అదే నేను నా అసిస్టెంట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడితే వెంటనే అతను బయటికి వెళ్లి నా గురించి నెగిటివ్ గా చెప్తాడు" అని అన్నారు.


"వర్క్, షూటింగ్ విషయాల్లో నేను చాలా పర్టికులర్ గా ఉంటాను. మనకు సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి మన మీద డబ్బు ఖర్చు చేస్తున్నారంటే దానికి మనం కచ్చితంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. ఉదాహరణకి షూటింగ్ టైంలో నా కాస్ట్యూమ్ విషయంలో తేడా జరిగితే అప్పుడు నేను కాస్ట్యూమ్ డిజైన్ చేసిన పర్సన్ ని తిడతాను. ఒకటి రెండుసార్లు మంచిగా చెప్తాను. వినకపోతే మూడోసారి తిట్టాల్సి వస్తుంది. మొదట్లో అయ్యా, బాబు అంటే వినరు. తిడితేనే వాళ్లకు గుర్తుంటుంది. అప్పుడు పని జరుగుతుంది. కానీ బయటికి వెళ్లి పేరు చెరగొడతారు" అని తెలిపారు.


" నేను ఈరోజు వరకు నా జీవితంలో నా సొంత పిల్లల్ని కూడా కొట్టలేదు. కనీసం దోమల్ని కూడా చంపను. అలాంటి వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు అంటే మనం ఏం చేయాలి? సరే అది వాళ్ళ కర్మ అని వదిలేయాలి. మనం ఎంత మంచి చేసినా మన వెనకాల చెడుగా మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు. అవి విన్నప్పుడు మొదట్లో నేను నేను అలా కాదు, ఇలా కాదు అని వాదించేదాన్ని. కానీ ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడుకోండి. అది నాకు అనవసరం. నన్ను అర్థం చేసుకునే నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటే చాలు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదు" అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.


Also Read : ప్రియమణి 'భామాకలాపం’ సీక్వెల్ వచ్చేస్తోంది - ఓటీటీలో కాదట!