Bhama Kalapam 2 : సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమె మరోవైపు లీడ్ రోల్స్‌లో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఓటీటీ 'ఆహా'లో రిలీజైన ఈ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈసారి 'భామాకలాపం' సీక్వెల్ ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.


ఇదే విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు 'భామాకలాపం 2' ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వాక్యూమ్ క్లీనర్ పట్టుకుని స్టైలిష్ లుక్ లోకి ప్రియమణి కనిపిస్తోంది. అలాగే ఆమె పక్కన రక్తం మరకలతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఉండడం, ప్రియమణి చుట్టూ గన్స్ ఫైర్ అవుతున్నట్లుగా.. వాటి వెనుక పెద్ద బిల్డింగ్ ఉన్నట్లు పోస్టర్ ని డిజైన్ చేయడంతో ఈ ఫస్ట్ లుక్ మరింత ఆసక్తిని పెంచింది. 'ది మోస్ట్ డేంజరస్ వుమన్' థియేటర్స్ లో రాబోతుందంటూ మేకర్స్ తెలియజేశారు. 'ఆహా' స్టూడియోస్ సమర్పణలో డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


అభిమన్యు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇక 'భామకలాపం'' సినిమా విషయానికొస్తే.. పక్క వాళ్ళ విషయాల పట్ల ఆసక్తిని చూపే అనుపమ అనే మధ్యతరగతి గృహిణి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది? ఆ నేరం నుంచి బయట పడేందుకు ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో భామాకలాపం మూవీ తెరకెక్కింది. ఇక దానికి సీక్వెల్ గా రాబోతున్న 'భామాకలాపం 2' కూడా క్రైమ్ కామెడీ పాయింట్ తోనే  రూపొందుతోంది. అయితే ఈసారి క్రైమ్, థ్రిల్లింగ్ ఎలివెంట్స్ డోస్ పెంచినట్లు గా తెలుస్తోంది. ఈమధ్య డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయిన సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తే వాటి సీక్వెల్స్ ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.


రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ఈ భారీ సక్సెస్ అందుకున్న 'పొలిమేర 2' కూడా ఇదే ఫార్మాట్ లో వచ్చింది. లాక్ డౌన్ టైంలో 'పొలిమేర' పార్ట్ వన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. మెల్లమెల్లగా మౌత్ టాక్ తో భారీ రెస్పాన్స్ అందుకోవడంతో దాని సీక్వెల్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు భామాకలాపం మూవీ మేకర్స్ కూడా దీన్నే ఫాలో అవుతూ సీక్వెల్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సీక్వెల్ థియేటర్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Also Read : ‘కంగువ‘ షూటింగ్ లో ప్రమాదం, హీరో సూర్యకు గాయాలు, డాక్టర్లు ఏమన్నారంటే?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply