Raviteja's Mass Jathara Premiere Collection Worldwide : మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' శుక్రవారం ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రవితేజ కెరీర్‌‌లో ఇది 75వ మూవీ కాగా... బాక్సాఫీస్ వద్ద మాస్ జోష్ స్టార్ట్ అయ్యిందంటూ మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.

Continues below advertisement

ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ ప్రీమియర్లకు వరల్డ్ వైడ్ రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఈ మేరకు 'బ్లాక్ బస్టర్ జాతర బిగిన్స్' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే, ప్రీమియర్ల షోస్ కాకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి లక్షకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలిపింది. ఇక ఇప్పటివరకూ తొలి రోజు రూ.1.27 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Continues below advertisement

Also Read : ఆ రికార్డులు దాటేసిన 'బాహుబలి ది ఎపిక్' - ఫస్ట్ డే రీసెంట్ బ్లాక్ బస్టర్స్‌నే బీట్ చేసింది... కలెక్షన్స్ ఎంతో తెలుసా?

అంత కలెక్షన్సా?

అయితే, ప్రీమియర్లకో రూ.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటాయా? అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్లు బాగానే వేసినా కనీసం టికెట్ రేట్స్ పెంచకుండా ఇంత కలెక్షన్స్ వచ్చాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మాస్ మహారాజ ఫ్యాన్స్ మాత్రం వరల్డ్ వైడ్‌‌గా ప్రీమియర్స్ బాగానే పడ్డాయని... అందుకే అంత కలెక్షన్స్ వచ్చాయని... ఫస్ట్ డే కూడా ఈ జోష్ ఇలానే కొనసాగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా చేశారు. భాను భోగవరపు దర్శకత్వం వహించగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. రవితేజ ఆర్పీఎఫ్ ఆఫీసర్ కాగా... శ్రీలీల టీచర్‌గా నటించారు. రాజేంద్ర ప్రసాద్, వీటీవీ గణేష్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అల్లురి జిల్లాలోని గిరిజన గ్రామాలను తన అడ్డాగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేసే శివుడు (నవీన్ చంద్ర)ను సిన్సియర్ రైల్వే ఎస్సై లక్ష్మణ్ భేరి (రవితేజ) ఎలా ఎదుర్కొన్నాడనేదే స్టోరీ.