మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అంటే యాక్షన్ ఒక్కటే కాదు... కామెడీలోనూ స్పెషలిస్ట్. ఆయన తర్వాత తరం హీరోల్లో ప్రేక్షకులను నవ్విస్తున్న వాళ్లలో కింగ్‌ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu). ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. 

Continues below advertisement

రవితేజ... శ్రీవిష్ణు... వీరాధి వీరులు!రవితేజ, శ్రీవిష్ణు  కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి తెలుగు చిత్రసీమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో ఇప్పుడీ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి 'వీరాధి వీరులంట' (Veeradhi Veerulanta) టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

Continues below advertisement

'వీరాధి వీరులంట' సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. శ్రీవిష్ణుతో ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. 'రాజా రాజా చోర', 'స్వాగ్' సినిమాలు చేశారు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో హ్యాట్రిక్ అని చెప్పాలి. ఇదొక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌ అని టాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

సంక్రాంతి బరిలో 'వీరాధి వీరులంట'Veeradhi Veerulanta Movie Release Update: 'వీరాధి వీరులంట' సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. రవితేజ, శ్రీవిష్ణు కాంబోలో మొదటి సినిమా కావడం... ఇద్దరూ కామెడీ టైమింగ్‌లో ఎక్సట్రాడినరీ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది.

Also Read: Kangana Ranaut Queen 2 Controversy - కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు