రవితేజ (Ravi Teja)ను అభిమానులకు ముద్దుగా మాస్ మహారాజా అంటారు. స్క్రీన్ మీద ఆయన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాదు... ఆయన చేసిన మాస్ క్యారెక్టర్లకు తగ్గ ట్యాగ్ అది. రవితేజ 75వ చిత్రానికి 'మాస్ జాతర' టైటిల్ ఖరారు చేయడానికి కారణం కూడా అదే. వింటేజ్ రవితేజను చూపించే సినిమాకు ఆ టైటిల్ అయితే బావుంటుందని భావించారంతా! అయితే... ఆ తర్వాత సినిమాను క్లాస్ టైటిల్ ఖరారు చేశారు రవితేజ. అది ఏమిటో తెలుసుకోండి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి!Ravi Teja 76th film titled Bharthamahasayulaku Vignapthi: అవును... మీరు పైన చదివిన లైన్స్ కరెక్టే. సాధారణంగా దేవాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ మైకుల్లో 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అని వినబడుతుంది. భక్తులకు ఏదైనా చెప్పాలని లేదా వివరించాలని అనుకుంటున్న తరుణంలో మాటలను అలా ప్రారంభిస్తారు. ఇప్పుడు రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటున్నారు. అంటే పెళ్ళైన మగాళ్లకు ఆయన ఏదో చెప్పబోతున్నారు. తొలుత ఈ చిత్రానికి 'అనార్కలి' టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' బావుంటుందని అది ఫిక్స్ చేశారట.
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?
రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల విడుదలైన 'మిరాయ్'లో కిశోర్ తిరుమల నటుడిగా కనిపించారు. దర్శకుడిగా 'నేను శైలజ', 'వున్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి', 'రెడ్', 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' వంటి సినిమాలు చేశారు. మూడేళ్ళ విరామం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది.
రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు!'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో రవితేజ సరసన 'రొమాంటిక్' భామ కేతికా శర్మ, 'నా సామి రంగ' ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం స్పెయిన్ వెళ్ళింది. అక్కడ కొంత టాకీతో పాటు సాంగ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశారు.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!