రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఇరుముడి' (Irumudi). ఆయన కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతుందని సమాచారం. ఎందుకంటే... ఆయన రీసెంట్ సినిమాల్లో ఎక్కువగా మాస్ రోల్స్ చేశారు. ఇప్పుడీ 'ఇరుముడి'లో సరికొత్త, విభిన్నమైన పాత్ర చేస్తున్నారని, తన నటన పరంగా కొత్త కోణంలో కనిపించబోతున్నారని టాక్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
జూన్ 3న 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్ విడుదలIrumudi First Glimpse Release Date: 'ఇరుముడి' చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు చిత్ర బృందం కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న... అంటే బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో తండ్రి కూతుళ్లు కనిపిస్తున్నారు. మొదటి నుంచి తండ్రీ కుమార్తెల నేపథ్యంలో సినిమా అని ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ చూస్తే... తండ్రీ కుమార్తెల మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.
రవితేజ లాంటి మాస్ హీరో, 'ఇరుముడి'లోని ఎమోషనల్ రోల్‌లో ఎలా కనిపిస్తారో అని ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. అలాగే, అయ్యప్ప దీక్ష - మాలలో ఆయన్ను తెరపై చూడాలని అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Dil Raju vs Mythri - 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
Irumudi Movie Cast And Crew: రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న 'ఇరుముడి' సినిమాలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ నుంచి వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
