సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్స్ తో పాటు పెళ్లి విడాకులు కూడా కామన్ అయిపోయాయి. ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా బోలెడన్ని బ్రేకప్ లు, విడాకులు ఉన్నాయి. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇవన్నీ దాటి వచ్చిన వాళ్లే. కానీ చాలామంది తమ ప్రేమ విషయాలను నిర్మామాటంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. అయితే ఓ హీరోయిన్ మాత్రం తన ఎఫైర్స్ ని ఏకంగా తన పిల్లలతోనే షేర్ చేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రవీనా టాండన్. 1990 ల కాలంలో కథానాయికగా వెలుగొంది రవీనా. అప్పట్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను ప్రేమించింది. 'మొహ్రా' అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.
ఆన్ స్క్రీన్ పై తమ జోడితో ఆకట్టుకున్న వీళ్లు రియల్ లైఫ్ లోనూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ప్రకటించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అంతలోనే బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరే వాళ్ళని చూసుకొని మళ్లీ డేటింగ్ చేశారు. అలా కొన్నాళ్ల తర్వాత రిలేషన్ షిప్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ 2004లో బిజినెస్ మాన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది రవీనా. ఈ జంట కి రాష, రణ్ బీర్ వర్ధన్ సంతానం. కానీ పెళ్లికి ముందే 1995లో పూజా, ఛాయ అనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని వాళ్ళకి కూడా అమ్మయింది రవీనా. ఇదిలా ఉంటే పిల్లల దగ్గర తన వ్యక్తిగత విషయాలను ఏదీ దాచనని చెప్పింది. ఆఖరికి గతంలో ఉన్న తన ప్రేమ కథలతో సహా దాచకుండా పిల్లలతో పంచుకుంటానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవీనా టండన్ మాట్లాడుతూ.." నా ఎఫెక్ట్స్ గురించి పేపర్లో కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారు పడొద్దు. అందుకే పత్రికల వాళ్ళ కంటే ముందే నేనే వాళ్లకు అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపో మాపో ఎలాగైనా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి. అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. నా గురించి చాలా చెత్తగా రాశారు. బాడీ షేవింగ్ చేశారు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేవారు. నిజ నిజాలు కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది రాసే వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కనీసం మా వెర్షన్ చెప్పుకోవడానికైనా వీలవుతుంది" అంటూ చెప్పుకొచ్చింది రవీనా టాండన్.
దీంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తన ఎఫైర్స్ ని కూడా పిల్లలతో షేర్ చేసుకుంటానని రవీనా చేసిన కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈమె వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. కాగా రవీనా టాండన్ ప్రస్తుతం 'వెల్ కమ్ టు ది జంగిల్'(Welcome To The Jungle) అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాన్ని, లారా దత్త, సునీల్ శెట్టి, సంజయ్ దత్, అర్షద్ వార్షి, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పడే, రారాజ్ పాల్ యాదవ్, రాహుల్ దేవ్, దలెర్ మెహేంది, మిల్కా సింగ్ లాంటి ప్రధాన తారాగడం నటిస్తున్నారు.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?