Rashmika Mandanna's Mysaa Movie New Release Date : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన 'ఒసేయ్ రాములమ్మ' రీమిక్స్ పాట వైరల్ అవుతోంది. ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతుండగా... మూవీ వాయిద పడనుందనే ప్రచారం జరుగుతోంది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఈ మూవీకి సెన్సార్ సూచించిన కట్స్, ఇతర ఛేంజెస్ చేయడంతో పాటు ఫైనల్ కాపీ డిలే అయినందున వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 4 లేదా 11కు వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. మరి సెన్సార్ రివ్యూ ఆలస్యం అవుతుందా? లేదా? చెప్పిన టైంకే (నవంబర్ 27) మూవీ రిలీజ్ అవుతుందా అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ మూవీలో రష్మిక వారియర్‌గా కనిపించనున్నారు. అలాగే, ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తీక్ రంజని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తుండగా... శ్రేయాస్ కృష్ణ DOP. అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మిస్తున్నారు.
