ఇటు సినిమాలు... అటు వాణిజ్య ప్రకటనలు... ప్రస్తుతం చేతి నిండా పనితో బిజీగా ఉన్న కథానాయిక రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ఆమె గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. అందులో ఒక రూమర్ నిజమే అని రష్మిక అన్నారు. అది ఏంటంటే... టైగర్ ష్రాఫ్‌తో యాడ్ గురించి!
ప్రస్తుతం రష్మిక ముంబైలో ఉన్నారు. సోమవారం టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఒక యాడ్ చేశారు. ''ఆ రూమర్స్ నిజమే... చాలా నవ్వు వస్తోంది! టైగర్ ష్రాఫ్, నేను కలిసి ఇప్పుడే ఒక యాడ్ షూట్ చేశాం. అతడితో పని చేయడం బావుంది. ఈ యాడ్ కోసం నేనూ ఎదురు చూస్తున్నాను'' అని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. అదీ సంగతి!
Also Read : పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు - యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై విక్రమ్ రియాక్షన్
సినిమాలకు వస్తే... ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సరసన 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళ్ సినిమా. త్వరలో పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రష్మిక రెడీ అవుతున్నారు. హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాలు చేశారు. రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' ఉంది.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు