Rashmika Mandanna Upcoming Movies: ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించడమంటే మాటలు కాదు. అది కొంతమందికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది ఎవరు అంటే చాలామందికి రష్మిక మందనా పేరే ముందుగా గుర్తొస్తుంది. తన అప్‌కమింగ్ సినిమాల లైనప్ చూస్తుంటే తను ప్యాన్ ఇండియా హీరోయిన్ అనడంలో డౌట్ లేదు అనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దాదాపు అన్ని భాషల్లో పెద్ద పెద్ద స్టార్లతో జోడీకడుతోంది ఈ భామ. తాజాగా దేశంలోని టాప్ నటీమణుల లిస్ట్‌లో రష్మిక చేరిపోయింది అంటూ ఆశ్చర్యం లేదు.


ఏకంగా సల్మాన్‌తో..


సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ‘మిషన్ మజ్ను’తో రష్మిక మందనా బాలీవుడ్‌లో డెబ్యూ చేసింది. ఆ మూవీ తన బాలీవుడ్ కెరీర్‌కు అంతగా హెల్ప్ అవ్వలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మాత్రం తనను ఓ రేంజ్‌లో స్టార్‌ను చేసింది. దీంతో తనకు బీ టౌన్ నుంచి వరుస ఆఫర్లు రావడం మొదలయ్యింది. ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన ‘సికందర్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ఈ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి రష్మిక పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మురుగదాస్, సల్మాన్ ఖాన్ కలిసి చేస్తున్న మొదటి సినిమాలో ఈ కన్నడ బ్యూటీకి ఛాన్స్ రావడం మామూలు విషయం కాదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


తెలుగులో కూడా బిజీ..


తెలుగులో సైతం రష్మిక చేతిలో దాదాపుగా మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘పుష్ప 2’. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’లో మరోసారి శ్రీవల్లి అలరించనుంది ఈ భామ. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. పార్ట్ 1లో లాగా కాకుండా పార్ట్ 2లో రష్మిక కాస్త రిచ్‌గా కనిపిస్తుందని కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గర్ల్‌ఫ్రెండ్’ షూటింగ్‌లో రష్మిక బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కుబేర’లో కూడా తనే హీరోయిన్.


విక్కీ కౌశల్‌తో కూడా..


బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ ‘సికందర్’తో పాటు విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఛావ’లో కూడా రష్మిక మందనానే హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు మేకర్స్. ఇక తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన ‘యానిమల్’ ఫ్రాంచైజ్‌లో కూడా రష్మిక భాగం కానుంది. ‘యానిమల్’ను ఒక ఫ్రాంచైజ్‌లాగా తెరకెక్కించే ఆలోచన ఉందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఇందులో గీతాంజలి పాత్రలో కచ్చితంగా రష్మికనే కనిపిస్తుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఏ హీరోయిన్‌కు లేని లైనప్.. రష్మిక మందనాకు ఉంది.



Also Read: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?