2024 ముగియడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. ఈ సమయంలో అంతా ఈ ఇయర్‌లో ఏమేం జరిగాయో రీక్యాప్ చేస్తూ ఉంటారు. అందులో వివాదాలు కూడా ఉంటాయి. 2024లో ఏమేం వివాదాలు జరిగాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు చోటు చేసుకున్నాయంటూ అంతా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లి వస్తుంటారు. అయితే, అనూహ్యంగా ఈ ఇయర్ ముగుస్తున్న సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ రష్మిక ఏ వివాదంలో చిక్కుకుంది. సారీ చెప్పినా వదలనంత వివాదానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే..


ప్రస్తుతం ‘పుష్ప 2’ సక్సెస్‌తో ఆనందంలో ఉన్న రష్మికకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. క్షణం తీరిక లేకుండా ఆమె బిజీబిజీగా షూటింగ్స్ చేసుకుంటోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ అవకాశాన్ని వదలకుండా.. ఓకే చెప్పేస్తున్న రష్మిక.. కాస్త గ్యాప్ వస్తే చాలు బాలీవుడ్ వీధుల్లో మెరిసిపోతుంటుంది. అక్కడి మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తుంటుంది. అలా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి నెట్టేశాయి. ఈ ఇంటర్వ్యూలో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిత్రాల విషయంలో ఆమె కన్ఫ్యూజ్ అవడమే.. నెటిజన్లకు ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు పని కల్పించేసింది.


Also Read: ఈ ఏడాది ఓటీటీలో సందడి చేయనున్న బాలీవుడ్ క్రేజీ సినిమాలు, మోస్ట్ అవైటింగ్ సిరీస్‌లు ఇవే


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటే రష్మికకు చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. విజయ్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన రష్మిక.. థియేటర్‌లో తను చూసిన మొదటి సినిమా విజయ్ నటించిన ‘గిల్లి’ అని చెప్పింది. అంతటితో ఆగితే బాగానే ఉండేది. ఆ ‘గిల్లి’ సినిమా తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అని చెప్పింది. అంతే, ఆ వీడియోను నెట్టింట వైరల్ చేస్తూ.. రష్మికను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. వాస్తవానికి ‘గిల్లి’ సినిమా మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాకు రీమేక్. కానీ ఆమె ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అని చెప్పడంతో ఆమె వివాదంలో కూరుకుపోయింది. అయితే తను చేసిన తప్పు తెలుసుకుని.. వెంటనే సారీ చెబుతూ.. ఓ ట్వీట్ కూడా వేసింది రష్మిక. అయినా నెటిజన్లు వదలట్లే.






‘గిల్లి’ సినిమా ‘పోకిరి’ రీమేక్ కాదు.. మహేష్ ‘ఒక్కడు’ రీమేక్ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు స్పందించిన రష్మిక మందన్నా.. ‘‘అవును తెలుసు సారీ. ఒక బూబూ ఐపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా.. రేయ్.. ‘ఒక్కడు’ సినిమా ‘గిల్లి’ అని.. ‘పోకిరి’ సినిమా ‘పోకిరి’ అని. ఇక నాకు ఉందిలే.. సోషల్ మీడియాలో ఏసుకుంటారులే అని అనుకున్నా. సారీ సారీ.. తప్పుజరిగింది. కానీ వారు నటించిన అన్ని సినిమాలూ నాకు ఇష్టమే’’ అని కొన్ని సరదా ఇమోజీలతో రష్మిక సారీ చెప్పింది. మరి ఆమె సారీని మహేష్ బాబు అభిమానులు మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. మహేష్‌తో నటించి కూడా మీరు ఇలా చెబుతారు అంటూ.. గట్టిగానే కౌంటర్స్ వేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి. అంత క్యూట్‌గా, అచ్చ తెలుగులో సారీ చెప్పింది కాబట్టి.. ఈ వివాదం ఇంతటితో ముగిసిందనే భావించవచ్చు.


Also Readబాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే