Rashmika Reaction On Her Engagement : నేషనల్ క్రష్ రష్మిక మంధన్న, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వార్తలు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ కపుల్‌‍ కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇరువురి చేతికి రింగ్స్ ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం వీటికి మరింత బలం చేకూర్చింది. అయితే, అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ఇప్పటివరకూ దీనిపై బహిరంగంగా రియాక్ట్ కాలేదు. తాజాగా... 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు.

Continues below advertisement

ఫ్యాన్ క్వశ్చన్... రష్మిక క్యూట్ ఆన్సర్

తాజా ప్రెస్ మీట్‌లో ఓ అభిమాని 'విజయ్‌తో మీకు ఎంగేజ్మెంట్ జరిగిందా?. దానిపై క్లారిటీ కావాలి' అంటూ అడిగాడు. దీనిపై రియాక్ట అయిన రష్మిక... 'మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడే చేస్తాను.' అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. దీంతో ఆడియన్స్ ఒక్కసారిగా ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు. 'మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో రష్మిక నవ్వుకుని సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా రష్మికతో పాటు విజయ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

Continues below advertisement

Also Read: 'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్ స్టార్ హీరో కుమారుడే! - ఇద్దరు కుమారులు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేశారుగా...

దీంతో పాటే విజయ్‌తో నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీ రిజల్ట్ గురించి కూడా రష్మిక స్పందించారు. అప్పుడు మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయినా... ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుందని చెప్పారు. 'డియర్ కామ్రేడ్ మూవీని ఆడియన్స్‌తో పాటు థియేటర్లో చూశాను. అయితే, మేం ఆశించిన రెస్పాన్స్ రాలేదు. మా దృష్టిలో ఎప్పటికీ ఇది బెస్ట్ మూవీనే. టాక్ బయటకు వచ్చిన తర్వాత మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మనం ఇంకా ప్రయత్నిద్దాం అని మూవీ టీంకు చెప్పాను. అయినా అది ఫలించలేదు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మూవీ గురించి మాాట్లాడుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్‌లో డియర్ కామ్రేడ్ గురించి ఫోస్టులు పెడుతున్నారు. ఇది ఆడియన్స్‌కు నచ్చుతుందని అప్పుడు చెబితే ఎవరూ వినలేదు. ఓ సినిమా కోసం దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంత కష్టపడినా సరైన ఫలితం దక్కకుంటే బాధగా ఉంటుంది. ఆ టైంలో ప్రశంసలు దక్కకుండా ఏళ్ల తర్వాత దాన్ని ప్రశంసిస్తే బాధగా ఉంటుంది.' అని చెప్పారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన 'డియర్ కామ్రేడ్' మూవీ 2019లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక రష్మిక రీసెంట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా దీక్షిత్ శెట్టి నటించగా... రావు రమేష్, అను ఇమ్మాన్యుయేల్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా... అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.