Trolling On Rash Driving At Allu Arjun House: పుష్ప, పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్‌లో ఆయన క్రేజ్ చెప్పాలంటే మాటలు సరిపోవు. 'పుష్ప 2' రిలీజ్ సమయంలో ఆయన ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఆ డ్రైవింగ్ ఏంటి బ్రో..
అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆయన కారు ర్యాష్ డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఆయన ఇంటి ముందు ఫుట్ పాత్‌పై కారును ర్యాష్‌గా ఎక్కించేసినట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో అక్కడ కొంతభాగం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆ కారులో ఉన్నది అల్లు అర్జునా?, కాదా? అనేది క్లారిటీ లేదు. ఆయన ఇంటి ముందు కారు స్పీడుగా, ర్యాష్ డ్రైవింగ్‌తో ఇంటి లోపలికి వెళ్లడంతో ట్రోలింగ్ సాగుతోంది.
'ఆ డ్రైవింగ్ ఏంటి బ్రో.. ఇదేమైనా సినిమా అనుకున్నావా?' అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది ఏంటి బ్రో అలా ఎక్కించేశావ్? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఆ కారులో అల్లు అర్జున్ ఉన్నారో లేదో కూడా తెలియదని.. అనవసరంగా ట్రోలింగ్ ఎందుకంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?
ఇటీవలే.. ఓ ఫ్యాన్‌కు సెల్ఫీ ఇవ్వని కారణంగా అల్లు అర్జున్‌ను ట్రోల్ చేశారు. వేవ్స్ సమ్మిట్‌కు వెళ్లిన బన్నీ ముంబయి ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా.. ఓ ఫ్యాన్ ఆయనతో సెల్ఫీ దిగేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బన్నీ ఆయన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో చాలామంది ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ హీరోలంతా ఫ్యాన్స్‌తో ఓపిగ్గా సెల్ఫీలు దిగుతారని.. బన్నీ ఇలా చేయడం ఏంటంటూ ట్రోల్ చేశారు. కొందరు ఓవర్ ఆటిట్యూడ్ అంటూ కామెంట్స్ చేశారు.
అట్లీ - బన్నీ మూవీ వేరే లెవల్
ఇక సినిమాల విషయానికొస్తే.. బన్నీ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే డైరెక్టర్ అట్లీ బన్నీతో మీట్ అయ్యారు. మూవీకి సంబంధించి కీలక అంశాలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో హై ఆక్టేన్ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోందని తెలుస్తోంది.
సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కించనుండగా.. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనున్నట్లు అనౌన్స్‌మెంట్ వీడియోలోనే స్పష్టమైంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ రోల్‌పై భారీ హైప్ నెలకొంది. ఇదివరకు ఎన్నడూ లేని డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో నటించనున్నారనే ఓ వైల్డ్ రూమర్ ఇటీవల చక్కర్లు కొట్టింది. ఒక రోల్ మాత్రం పూర్తి యానిమేటెడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అప్‌డేట్స్ రానున్నాయి.