ఆగస్టు 23, 2023. ఈరోజు భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇదే రోజున చంద్రుని దక్షిణ ధృవం పై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయింది. భారతీయులు గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు సామాన్య ప్రజల నుంచి మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖులందరూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మన టాలీవుడ్ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చంద్రయాన్ 3 సక్సెస్ కి కారణమైన ఇస్రో ని అభినందించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం చంద్రయాన్ 3 గురించి స్పందించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిందని చెబుతున్నా కూడా ఆ స్టార్ హీరో ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా కార్ ఎక్కి వెళ్లిపోవడం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది.
ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ మరెవరో కాదు రణవీర్ సింగ్ కపూర్. తాజాగా రణవీర్ సింగ్ ముంబైలోని బాంద్రా లో ఓ డబ్బింగ్ స్టూడియోలో కనిపించాడు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు ఆయన్ని చంద్రయాన్ 3 సక్సెస్ అయిందని రణవీర్‌కు చెప్పారు. అయితే, రణవీర్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రణవీర్‌ను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోపై రియాక్ట్ అవుతూ.. ‘‘ఇది నిజంగా అవమానకరం. ఇలాంటి వాళ్ళనా మనం హీరోలుగా చూస్తున్నా? రియల్ హీరోస్ అంటే మన శాస్త్రవేత్తలే’’ అంటూ అని పేర్కొన్నారు.
మరో నెటిజన్.. ‘‘శాస్త్రవేత్తలే నిజమైన హీరోలు. దేశమంటే మర్యాద, విలువలు లేని ఈ ఆటిట్యూడ్ ఉన్నవాళ్లు హీరోలు కాదు. దేశంలో ఇంత గొప్ప సంఘటన జరిగితే కొంచెం కూడా రియాక్షన్ లేదేంటి?’’ అని అంటున్నారు. ‘‘ఇంత పెద్ద సక్సెస్‌పై స్పందించలేనందుకు సిగ్గుపడాలి. ఆయనకి దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఆయన సినిమా సక్సెస్ అయితే చాలు. ఆయనకెందుకు సంతోషం కలుగుతుంది. ఆయన్ని చంద్రుడిపైకి పంపించాలి’. అంటూ నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ తో రణవీర్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ తాకిడి తట్టుకోలేకనో, రియలైజ్ అయ్యాడో తెలీదు కానీ ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ఫోటోను షేర్ చేసి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇక 'చంద్రయాన్ 3' విషయానికొస్తే.. చంద్రుడిపై ఇస్రో పంపించిన మూడో మిషన్ ఇది. దీనికంటే ముందు 2009లో చంద్రయాన్-1 తో పాటూ చంద్రయాన్-2 ని 2019 జూలై 22 న చంద్రుడిపై పంపించగా.. ఆ మిషన్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ చంద్రయాన్- 3 చంద్రుడిపై విజయవంతంగా లాండ్ అయ్యి సరికొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి ఈ ఘనత సాధించిన దేశం మనదే కావడం విశేషం. ఇక రణవీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం 'డాన్ 3' సినిమాలో నటిస్తున్నాడు.
Also Read : భళా ‘జైలర్’ - బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా రచ్చ రంబోలా, మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?