కపూర్ ఖాందాన్‌లో భట్ కుమార్తె ఆలియా అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కపూర్ కోడలు. సుమారు ఐదేళ్ళ డేటింగ్ అనంతరం ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ మొన్న (ఏప్రిల్ 14, గురువారం) పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే తమ వివాహానికి ఆహ్వానించారు. హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. పెళ్ళిలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆలియా భట్ సోదరుడు రాహుల్ భట్ వెల్లడించారు.


పెళ్ళి అంటే ఏడడుగులు అంటారు కదా! తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు అగ్ని చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. దీనిని తెలుగు సంప్రదాయంలో సప్తపది (ఏడడుగులు) అని అంటారు. సిఖ్ సంప్రదాయంలో నాలుగు అడుగులు మాత్రమే ఉంటాయి. దానిని 'లావన్' అంటారు. పంజాబ్ నుంచి వచ్చిన కపూర్ ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అయ్యింది. సిఖ్ సంప్రదాయం ప్రకారం ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. అందువల్ల, నాలుగు అడుగులు వేశారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష... నాలుగు అడుగులు వేశారట.


Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?




అనూహ్యంగా పెళ్లి చేసుకోవాల్సి రావడంతో త్వరలో ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ తమ తమ సినిమా షూటింగులకు హాజరు కావాల్సి వస్తోందని బాలీవుడ్ టాక్. ఇక, వీళ్ళిద్దరూ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఆ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు.


Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?