సినిమాలకు సంబంధించిన ఏ విషయం అయినా కాంట్రవర్సీ క్రియేట్ చేయగలదు. ఆఖరికి సినిమాలకు వచ్చే అవార్డుల చుట్టూ కూడా ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతూ ఉంటాయి. తాజాగా 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగింది. అయితే కొన్ని అర్హత ఉన్న సినిమాలకు, అర్హత ఉన్న నటీనటులు ఈ అవార్డులు దక్కలేదని కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూర్య నటించిన తమిళ చిత్రం ‘జై భీమ్’కు ఏ కేటగిరిలో అయినా ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం దురదృష్టకరం అని చాలామంది అన్నారు. తాజాగా రానా కూడా ఈ నేషనల్ అవార్డ్ కాంట్రవర్సీపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.


నాని రియాక్షన్..
తెలుగు హీరో అయిన అల్లు అర్జున్.. ‘పుష్ప’లో తన పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ గెలవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చినా.. సూర్య నటించిన ‘జై భీమ్’కు ఏ మాత్రం గుర్తింపు రాకపోవడం బాధకరం. నేచురల్ స్టార్ నాని సైతం ‘జై భీమ్’ విషయంలో హార్ట్ బ్రేక్‌కు గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా రానా కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. తాజాగా సైమా అవార్డులకు అటెండ్ అయిన రానా.. ఏ విషయంలో అయినా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అభిప్రాయాలు వేరేగా ఉన్నా.. వ్యక్తులు మాత్రం కలిసే ఉంటారు. నేషనల్ అవార్డ్స్ విషయంలో నటుల మధ్య ఎలాంటి కాంట్రవర్సీ చోటుచేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.


అలా జరగలేదు..
‘ప్రతీ ఒకరికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. నాకు ఒక సినిమా నచ్చుతుంది. మీకు వేరే సినిమా నచ్చుతుంది. ఆర్టిస్టుల విషయంలో కూడా అంతే. ఆర్టిస్ట్ గురించి కాకపోయినా ఆ కథకు ఎన్నో అవార్డులు వచ్చుండాలి. కానీ అలా జరగలేదు.. అంతే. ఇప్పుడు తనకు అవార్డ్ దక్కకపోవచ్చు. అలా అని ఎప్పటికీ దక్కదని కాదు కదా..’ అని రానా ‘జై భీమ్’కు అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. జరిగిపోయినదాని గురించి ఆలోచించకూడదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. అంతే కాకుండా నేషనల్ అవార్డ్స్‌పై ప్రస్తుతం ఎలాంటి కాంట్రవర్సీ జరగడం లేదని, ప్రేక్షకులు.. సెలబ్రిటీల అభిప్రాయాలను ఆ కోణంలో చూడవద్దని క్లారిటీ ఇచ్చాడు.


కాంట్రవర్సీ చేస్తుంది మీరే..
‘ఇది ఎప్పుడూ కాంట్రవర్సీ కాదు. చాలావరకు స్టార్లంతా ట్వీట్స్ తప్పా ఏమీ చేయడం లేదు. కాంట్రవర్సీ అంటే మీరు చేస్తున్నదే. ఆర్టికల్స్, వీడియోలు, బేస్ వాయిస్‌తో యూట్యూబ్ లింక్స్ క్రియేట్ చేసి, వాటిని వైరల్ చేస్తున్నారు. అప్పుడు అది కాంట్రవర్సీ అవుతోంది. కానీ మా మధ్య మాత్రం ఏదీ కాంట్రవర్సీ కాదు.’ అంటూ ఆర్టిస్టుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి కచ్చితంగా చెప్పాడు రానా. నాని రియాక్షన్ గురించి రానాను అడగగా.. ‘నాని ఏం చేశాడు? అది కాంట్రవర్సీ ఎందుకు అయ్యింది? అవన్నీ మీ ఊహలు అంతే. నాకు చాలా విషయాలు నచ్చవచ్చు. మీకు చాలా విషయాలు నచ్చవచ్చు. అందరికీ ఒకే గుర్తింపు దక్కకపోవచ్చు. అవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ప్రతీ ఒక్కరికీ అభిప్రాయం అనేది ఉంటుంది’ అంటూ నాని చేసిన ‘జై భీమ్’ సోషల్ మీడియా పోస్ట్‌కు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు రానా.


Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్ మొదలు - లిస్ట్‌లో 8 మంది, ఎవరంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial