Rana at HanuMan Promotions: సంక్రాంతి రేసులో విడుదలయిన సినిమాల్లో సూపర్ సక్సెస్‌ను సాధించింది ‘హనుమాన్’. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’తో పోటీపడి మరీ ‘హనుమాన్’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి.. అక్కడ కూడా ‘హనుమాన్’ను ప్రమోట్ చేసింది మూవీ టీమ్. ముంబాయ్‌కు ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు వారి సినిమాను సపోర్ట్ చేయడానికి రానా కూడా అక్కడికి వెళ్లాడు. ఇక ఆ ఈవెంట్‌లో జరిగిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో వైరల్..
తెలుగు సినిమాను నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా ప్రమోట్ చేయాలంటే రానా ఎప్పుడూ ముందే ఉంటాడు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఆలోచన లేకుండా మూవీలో కంటెంట్ ఉంటే రానా కచ్చితంగా సపోర్ట్ చేస్తాడని ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో బయటపెట్టాడు. ఇక ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ను కూడా రానా.. అదే విధంగా సపోర్ట్ చేశాడు. ముంబాయ్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అక్కడ మీడియాతో చర్చించాడు. ఈవెంట్ ముగిసిన తర్వాత ‘హనుమాన్’ పోస్టర్‌‌తో ఫోటో దిగాలని మూవీ టీమ్ డిసైడ్ అయ్యింది. ఆ సమయంలో తన షూలను విప్పేసి పోస్టర్ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు రానా.






దేవుడి పోస్టర్ కాబట్టి..
ముంబాయ్‌లో ‘హనుమాన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు రానా. అలాగే ‘హనుమాన్’ పోస్టర్ దగ్గర ఫోటో దిగాలని వారు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తన షూలను విప్పేసి.. పోస్టర్ దగ్గరకు వెళ్లాడు రానా. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రానా చేసిన పనికి ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇది దేవుడికి సంబంధించిన సినిమా కాబట్టి.. దేవుడి ఫోటోతో ఏర్పాటు చేసిన పోస్టర్ కాబట్టి దాని ముందు నిలబడడానికి రానా.. తన షూస్‌ను విప్పేశాడని, ఇది మంచి విషయమని అంటున్నారు. ఇక ఆ ఈవెంట్‌లో.. మూవీ టీమ్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు రానా రావడానికి సిద్ధంగా ఉన్నాడని తేజ సజ్జా బయటపెట్టాడు.


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..
‘హనుమాన్’ మూవీలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించింది. విలన్‌గా వినయ్ రాయ్.. తన యాక్టింగ్ ప్రతిభను చూపించాడు. ముఖ్యంగా ఈ మూవీలో సముద్రఖని పోషించిన పాత్ర వేరే లెవెల్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక ‘హనుమాన్’ అనేది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక భాగమే అని దర్శకుడు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నాడు. ఈ మూవీ హిట్ అయితే మరెన్నో సూపర్ హీరో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తానని మాటిచ్చాడు. అనుకున్నట్టుగానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.


Also Read: ‘సలార్’ సక్సెస్ పార్టీలో అఖిల్, పార్ట్-2లో అయ్యగారు? చేతికి గాయం ఎలాగైంది?