Ramayana Trailer Release Postponed : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ విజువల్ వండర్ రామాయణ. నితీశ్ తివారీ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగా అనౌన్స్ చేశారు. అయితే, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడినట్లు ప్రకటించారు.

Continues below advertisement

ఇదే టైంలో గ్లోబల్ స్థాయిలో రామాయణను తీసుకెళ్లేలా ముందడుగు పడిందని అనౌన్స్ చేశారు. లాస్ట్ మినిట్‌లో ఈవెంట్ వాయిదా పడిందని... త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా పోస్ట్ పెట్టారు. 

ఇంటర్నేషనల్ స్థాయిలో...

Continues below advertisement

'రామాయణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే నా కల ఇప్పుడు 'సోనీ పిక్చర్స్' ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో నిజం కానుంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని భావించి లాస్ట్ మినిట్‌లో ట్రైలర్ రిలీజ్ వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినీ రంగంలో ఈ సినిమా గర్వ కారణంగా నిలవనుంది. హాలీవుడ్ సినిమాలకు దీటుగా రామాయణ ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచం నలుమూలలకూ వెళ్తుంది.' అంటూ  రాసుకొచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రాముడిగా రణబీర్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read : Purushaha OTT : ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో రామాయణ ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని నేచరల్ బ్యూటీ సాయి పల్లవి అన్నారు. అమెరికాలో జరుగుతున్న ప్రముఖ శాన్ డియాగో కామిక్ కాన్ 2026 వేడుకల్లో మూవీ టీం పాల్గొంది. రణబీర్ కపూర్, యశ్, డైరెక్టర్ నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్‌పై యశ్‌ ప్రశంసలు కురిపించారు.

'రాముడి పాత్రలో రణబీర్ గొప్పగా నటించారు. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. సినిమా చూసినప్పుడు అతని డెడికేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సినిమాను చిత్రీకరించాలంటే సంకల్ప బలం గొప్పగా ఉండాలి. మంచి టీం ఉన్నప్పుడు ప్రతిదీ కలిసి వస్తుంది. ఈ సినిమా ప్రారంభించాక జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. మేకప్స్ నుంచి లుక్స్ వరకూ టెక్నికల్ పరంగా ఎంతో సవాల్‌తో కూడుకున్న పని. శక్తివంచన లేకుండా కృషి చేశాం.' అని చెప్పారు.

ఈ మూవీలో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా... రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కైకేయిగా లారా దత్తా, కౌశల్యగా ఇందిరా కృష్ణన్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మంధరగా షీబా చద్దా రాణి నటిస్తున్నారు. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు పార్టులుగా మూవీని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనుండగా... వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్ రిలీజ్ చేయనున్నారు. 

Also Read : Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.