యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో... ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఈరోజు వచ్చింది. విజయ దశమి సందర్భంగా ఆయన ప్రేక్షకులకు కొత్త కబురు చెప్పారు అది ఏమిటో తెలుసా? 


మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా?
Ram Pothineni New Movie: అవును... మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు అండి. యువ దర్శకుడు మహేష్! 


సందీప్ కిషన్, జగపతి బాబు హీరోలుగా 'రారా కృష్ణయ్య' సినిమాతో పాటు ఇటీవల అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా తీసిన దర్శకుడు మహేష్ బాబు పచ్చిగోళ్ళ (Mahesh Babu Pachigolla). ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తనకు స్పెషల్ అని ఆయన పేర్కొన్నారు.


Also Read: బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?






Mahesh Babu to direct Ram Pothineni: రామ్ పోతినేని కథానాయకుడిగా మహేష్ బాబు పచ్చిగోళ్ళ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మించనున్నారు. హీరోగా రామ్ 22వ చిత్రం ఇది. అందుకని RAPO 22 అని పేర్కొంటున్నారు. హీరోయిన్ ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.



రామ్ సూపర్ హిట్ సినిమాల సరసన!
కథానాయకుడిగా రామ్ పోతినేని ప్రయాణం చూస్తే మొదటి సినిమా 'దేవదాసు', ఆ తర్వాత చేసిన సినిమాలలో 'జగడం', 'రెడీ', 'గణేష్', 'కందిరీగ', 'ఇస్మార్ట్ శంకర్', 'హలో గురు ప్రేమ కోసమే', 'నేను శైలజ' సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి విజయాలు సాధించాయి. ఆ సినిమాల సరసన తాము నిర్మించబోయే సినిమా చేరుతుందని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. 



రామ్ ఎనర్జీ అంతటినీ వాడుకుని ఇప్పటివరకు వెండితెరపై చెప్పని కొత్త కథను చెప్పబోతున్నామని మంత్రి మూవీ మేకర్స్ సంస్థ వర్గాలు చెబుతున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సినిమా జానర్ ఏమిటి? ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


Also Readమెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్