Ram Pothineni's Andhra King Taluka Release Date: యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ టీం నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' అనౌన్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. 'స్టార్స్ ఫ్యాన్స్ అందరూ సమావేశం అయ్యారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని సినిమాలో చూసుకున్నారా? ఈ ఏడాది మీ జీవితాన్ని బిగ్ స్క్రీన్‌పై తిరిగి చూడడానికి రెడీగా ఉండండి. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.' అంటూ రాసుకొచ్చారు.

Also Read: రాక్షసుడి బారి నుంచి బిడ్డను ఆ తల్లి రక్షించుకుందా? - ఓటీటీలోకి మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'మా'

ఈ మూవీకి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేం పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా... రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన 'సూర్యకుమార్' రోల్‌లో సినీ హీరోగా కనిపించనుండగా... ఆయనకు బిగ్ ఫ్యాన్‌గా సాగర్ రోల్‌లో రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. హీరోకు, ఫ్యాన్‌కు మధ్య జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఓ అందమైన లవ్ స్టోరీని కూడా చూపించనున్నారు.

ఈ మూవీలో రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సేతో పాటు రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య, VTV గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో మూవీని నిర్మిస్తున్నారు. వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తుండగా... రామ్ ఓ పాట రాశారు. 'ఒక చూపుతో నాలోనే పుట్టిందే... ఏదో వింతగా గుండెలో చేరిందే...' అంటూ సాగే లవ్ సాంగ్‌కు లిరిక్స్ అందించారు రామ్. ఇటీవలే ఈ పాట రిలీజ్ చేయగా ట్రెండ్ అయ్యింది. 

యూత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఎనర్జిటిక్ హీరోగా తనదైన యాక్టింగ్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రామ్. చాలా రోజులుగా రామ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీ మంచి హిట్ సాధించగా... ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ మూవీతో ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.