హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సనాతో మరో మూవీ(RC16)కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ బజ్ చక్కెర్లు కొడుతోంది. బుచ్చిబాబు ఈ మూవీలో కూడా విజయ్ సేతుపతికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. సేతుపతి ‘ఉప్పెన’ మూవీలో నెగటివ్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే, RC16లో ఏ పాత్రలో నటిస్తాడనేది ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని తెలిసింది.


ఈ మూవీలో రామ్ చరణ్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనుందని తెలిసింది. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌తో ‘దేవర’ (NTR30) మూవీలో నటిస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో జాన్వీకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 


రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ చాలా గ్యాప్ తీసుకోవడంతో అభిమానులు కూడా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన తండ్రి కావడంతో కొద్ది రోజులు షూటింగ్స్‌కు విరామం ప్రకటించారు. అలాగే, దర్శకుడు శంకర్ కూడా ‘భారతీయుడు - 2’ సినిమాలో బిజీగా ఉండటంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. దీనిపై చెర్రీ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై దర్శకనిర్మాతలను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. 


ప్రస్తుతం గేమ్ ఛేంజర్(Game Changer), భారతీయుడు 2 (Indian 2) సినిమాలు రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి. నిర్మాతలు కూడా దర్శకుడు శంకర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. భారతీయుడు 2ను సంక్రాంతికి రిలీజ్ చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ అనుకున్న దానికంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక నెల విరామం తర్వాత చెర్రీ కూడా ‘గేమ్ ఛేంజర్’ ఆగస్టు నుంచి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలిసింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీలో హీరోయిన్ కియరా అద్వానీతోపాటు అంజలీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్టోరీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.


‘లియో’లో రామ్ చరణ్?


'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్త సినిమాపై ఒక్కసారిగా హైప్ ని పెంచేసింది. ఈ వార్త ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం 'లియో' సినిమాలో రామ్ చరణ్ ఎటువంటి గెస్ట్ రోల్ చేయడం లేదనే వార్త ఒకటి బయటకు వచ్చింది. అవును, రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త పూర్తిగా అవాస్తవమట. ఇటీవల రామ్ చరణ్ స్వయంగా లోకేష్, విజయ్ లను లంచ్ కి ఆహ్వానించారని, అందుకు ఇద్దరూ అంగీకరించారనే వార్త సోషల్ మీడియాలో రావడంతో 'లియో' సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.  


Read Also : దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial