Ram Charan Upasana Couple Twins Names Announced : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రీసెంట్‌గా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న చిన్నారుల బారసాల కార్యక్రమం నిర్వహించగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పిల్లల పేర్లు వెల్లడించారు.
ట్విన్స్ నేమ్స్... వాటి అర్థం ఏంటంటే?
అబ్బాయి, అమ్మాయికి జన్మనివ్వగా... అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్వీరా దేవి అని చరణ్ దంపతులు వెల్లడించారు. వారికి ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలను కూడా వివరించారు. అమ్మానాన్నల సలహాలతో పాటు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా పిల్లల పేర్లు ఉండాలని అలా పెట్టినట్లు చెప్పారు. 'పిల్లలకు పేర్లు పెట్టడం కోసం నేను ఉపాసన చాలా ఆలోచించాం. వినగానే ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉండాలనుకున్నాం.
అమ్మానాన్నల సలహాలు తీసుకుని అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్వీరా దేవి. 'అన్' అంటే అపరిమితమైన, వీర అంటే ధైర్యం, దేవి అంటే దైవిక శక్తి. అపరిమితమైన ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఈ పేరు పెట్టాం. ఇక శివరామ్ అంటే శివుడు, రాముడు పేర్లు కలిసేలా పెట్టాం. అలాగే మా నాన్న పేరు (శివ శంకర వరప్రసాద్) కలిసేలా శివరామ్ అని పెట్టాం.' అంటూ వివరించారు.
Also Read : నాని 'ది ప్యారడైజ్' రిలీజ్ వాయిదా - అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మనవడు, మనవరాలితో చిరంజీవి
ఇక మనవడు, మనవరాలి బారసాల ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరు దంపతులు సందడి అంతా ఇంతా కాదు. మెగా వారసుడిని ఎత్తుకుని చిరు, సురేఖ దంపతులు బెస్ట్ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే ఫోటోలో క్లీంకార ఉండగా... ఆమె ఫోటో రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
డబుల్ ఆనందం
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇంతకు ముందు క్లీంకార జన్మించింది. రీసెంట్‌గానే మెగా ఫ్యామిలీలో డబుల్ ఆనందం వచ్చేలా వీరికి కవలలు జన్మించారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని కలిగి ఉండడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నానని చరణ్ పోస్ట్ పెట్టారు. మన జీవితంలో మహిళలే అత్యంత బలం అని... ఎప్పటికీ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులకు థాంక్స్ చెప్పారు.
