Ram Charan Thanks To Allu Arjun For Peddi Success : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ మూవీ చూసి సూపర్ రివ్యూ ఇస్తుండగా... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పెద్ది రివ్యూ ఇచ్చారు. దీనిపై రామ్ చరణ్ థాంక్స్ చెప్పారు.

Continues below advertisement

థాంక్యూ బన్నీ

'థాంక్స్ బన్నీ. మీ విషెష్ నాకు, పెద్ది టీమ్‌ మొత్తానికి చాలా విలువైనవి. బోలెడంత ప్రేమతో రాకా కోసం వెయిట్ చేస్తున్నా.' అంటూ రియాక్ట్ అయ్యారు. అంతకు ముందు పెద్దిని చూసిన అల్లు అర్జున్... చరణ్ నటనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 'పెద్ది చూశాను. రామ్ చరణ్ నటన అద్భుతం. సహజమైన నటన, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అద్భుతమైన డ్యాన్స్, ఇలా ప్రతీ విషయంలోనూ చరణ్ అదరగొట్టాడు.

Continues below advertisement

నా సోదరుడిని చూసి నిజంగా చాలా గర్వంగా ఉంది. జగపతిబాబు, జాన్వీ కపూర్ నటన అద్భుతం. డైరెక్టర్ బుచ్చిబాబుకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన అందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లి చరణ్ గారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. పెద్ది చిత్ర బృందానికి అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : Nandus World Nandu Controversy : నందూస్ వరల్డ్ నందు పాస్ పోర్ట్ డిస్మిస్? - ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు

రూమర్స్‌కు చెక్

కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్స్, ఫంక్షన్స్‌‌లో ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో వీటికి మరింత బలం చేకూరింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఎడమొహం, పెడ మొహంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అటు, మూవీస్ రిలీజ్ టైంలో ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. 

ఆ తర్వాత జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో రెండు ఫ్యామిలీస్ కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కు చెక్ పడింది. హీరోల మధ్య దూరం పెరిగిందని వచ్చిన వార్తలపై కూడా చాలా సందర్భాల్లో క్లారిటీ వచ్చినా రూమర్స్ ఆగలేదు. తాజా ట్వీట్‌తో ఇద్దరి మధ్య విభేదాలనే రూమర్స్‌కు ఫుల్ చెక్ పెట్టేశారు.

Also Read : Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!

అఖిల్ రివ్యూ

పెద్ది మూవీపై అఖిల్ అక్కినేని రివ్యూ ఇచ్చారు. 'డియర్ రామ్ చరణ్... మీ కృషి, అంకిత భావం సినిమాను చివరి వరకు నిలబెట్టాయి. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడిన అద్భుత నటన. వర్క్ పట్ల మీకున్న డెడికేషన్, దాన్ని సునాయాసంగా చేసే విధానానికి మీకు నా వందనం. బ్లాక్ బస్టర్ వీకెండ్ సాధించిన పెద్ది టీంకు నా అభినందనలు. ఎంతో కష్టపడిన యాక్టర్స్, సాంకేతిక నిపుణులందరికీ హ్యాట్సాఫ్. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి.' అంటూ ట్వీట్ చేశారు.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.