సుమారు మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ గురువారం, సెప్టెంబర్ 7న థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల అవుతోంది. యంగ్ హీరో నవీన్ పోలీస్ శెట్టితో అనుష్క మొదటిసారి ఈ సినిమాలో జత కట్టింది. అయితే మూవీ టీం ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా వినూత్న రీతిలో చేస్తున్నారు. సెలబ్రిటీస్‌కు ఓ చాలెంజ్‌ను విసురుతూ తమకు నచ్చిన ఫుడ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు #MSMP recipe challaenge పేరుతో మూవీ టీం సరికొత్త ప్రమోషన్స్ చేస్తోంది. ఇలా ప్రమోషన్ చేయడానికి ఓ రీజన్ ఉంది.


అదేంటంటే ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రను పోషించింది. అందుకే మూవీ టీం ప్రమోషన్స్ ని ఇలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అనుష్క ముందుగా తనకు మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఇష్టమని వాటి రెసిపీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ చాలెంజ్‌ను పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు విసిరింది. దీంతో తనకిష్టమైన రొయ్యల పులావ్ రెసిపీని ప్రభాస్ షేర్ చేశారు. ఇక ప్రభాస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి #MSMP recipe challaenge విసిరారు. దీనికి తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ప్రభాస్ విసిరిన  #MSMP recipe challaenge ను రామ్ చరణ్ స్వీకరించి తనకు ఇష్టమైన ఫుడ్ చేపల పులుసు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.






ఈ మేరకు నెల్లూరు చేపల పులుసు రెసిపీని పోస్ట్ చేశారు చరణ్. ఆ తర్వాత దగ్గుబాటి హీరో రానా ని ఈ చాలెంజ్ లోకి ఆహ్వానించారు." నేను ఛాలెంజ్ ని తీసుకున్నా #MSMP recipe challaenge లోకి ఇదేనా ఎంట్రీ. నా ఫేవరెట్ చేపల పులుసు. ఈ ఫన్ లో జాయిన్ అవ్వాలని రానా దగ్గుబాటిని నేను ఆహ్వానిస్తున్నా. రేపు రిలీజ్ కాబోతున్న మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర టీం కి ఆల్ ది వెరీ బెస్ట్" అంటూ రాంచరణ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా నెల్లూరు చేపల పులుసు రెసిపీ పూర్తిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఈ చాలెంజ్ ని దగ్గుబాటి రానా స్వీకరిస్తాడా? లేదా అనేది చూడాలి.


ఇక 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విషయానికొస్తే.. ఓ డిఫరెంట్ జోనర్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడం, నవీన్ పోలిశెట్టితో మొదటిసారి ఆమె జోడి కట్టడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్ సంస్థపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతోంది.


Also Read : అలాంటి వారెవరూ నాకు తెలియదు: మంత్రి రోజాపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial