ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) కోసం భారతీయ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మార్చి 13... ఆదివారం ఉదయం నిద్రలేచి ప్రోగ్రామ్ చూడాలని అలారమ్ పెట్టుకున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) పాటకు అవార్డు రావడం ఖాయమని అభిమానులు అందరూ భావిస్తున్నారు.
భారతీయ ప్రేక్షకులు, 'ఆర్ఆర్ఆర్' సినిమా అభిమానులు లైవ్‌లో ఆస్కార్స్ ప్రోగ్రామ్ చూడాలని వెయిట్ చేస్తుంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి అమెరికా వెళ్ళారు. హీరోగా కాకుండా 'ఆర్ఆర్ఆర్' అభిమానిగా హాజరు అవుతున్నానని ఆయన చెప్పారు.
టామ్ క్రూజ్, కేట్ బ్లాంచెట్...
వాళ్ళిద్దర్నీ కలుస్తా - రామ్ చరణ్
తనకు ఆస్కార్స్ అంటే ఎంతో ఇష్టమని రామ్ చరణ్ తెలిపారు. చిన్నతనం నుంచి ఎవరెవరు ఆస్కార్స్ అందుకుంటున్నారో తెలుసుకోవడం కోసం తెల్లవారుజామున నిద్రలేచి మరీ ప్రోగ్రామ్ చూసేవాడిని అని ఆయన వివరించారు.
'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు...' సాంగ్ నామినేట్ కావడంతో తనకు అకాడమీ అవార్డ్స్ నుంచి ఆహ్వానం అందిందని, అయితే ఆ సినిమా హీరోగా కాకుండా ఓ అభిమానిగా కార్యక్రమానికి హాజరు అవుతానని ఆయన తెలిపారు. హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్ (Tom Cruise), కేట్ బ్లాంచెట్ (Cate Blanchett)ను కలుస్తానని ఆయన వివరించారు. టామ్ క్రూజ్ 'టాప్ గన్ : మేవరిక్' సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది.
లేటెస్టుగా 'ఎంటర్టైన్మెంట్ టునైట్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్... అందులో ఈ విషయాలు వెల్లడించారు. అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి అక్కడి మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఆయన్ను ఆకాశం అంత ఎత్తులో చూస్తోంది. హాలీవుడ్ హీరోలతో పిలుస్తోంది. 'రామ్ చరణ్... బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా' అని అంటోంది.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్న రామ్ చరణ్... ఏబీసీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత KTLA5 న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు 'బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా'గా చరణ్‌ను పరిచయం చేశారు. అదీ సంగతి! KTLA5 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆస్కార్స్ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.
ఆస్కార్స్, లైవ్ పెర్ఫార్మన్స్ గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా... రామ్ చరణ్ ''ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమాను ఎంతో ఆదరించారు. సాంగుకు పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్'' అని చెప్పారు.
చరణ్ పక్కన నిలబడటమే అవార్డు
ఇటీవల 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. అవార్డు అందుకోవడం కోసం కాదు... స్టేజి మీద ఆయనొక అవార్డు అనౌన్స్ చేసి ఇచ్చారు కూడా! 'బెస్ట్ వాయిస్ ఆర్ మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్' కేటగిరీలో అవార్డు అనౌన్స్ చేయడానికి ఆయనతో పాటు హాలీవుడ్ నటి అంజలి భీమని వేదిక మీదకు వెళ్ళారు. ఆయన పక్కన ప్రజెంటర్‌గా నిలబడటమే అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని అని అంజలీ చెప్పారు. అందుకు బదులుగా రామ్ చరణ్ ఆమెకు థాంక్స్ చెప్పారు, నమస్కరించారు.
Also Read : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?