Entamma song making video : రామ్ చరణ్, సల్మాన్ సాంగ్‌లో షర్ట్స్ కలర్ చేంజ్ - 'పఠాన్' ఎఫెక్టా?

Ram Charan Salman Khan : రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్ కలిసి హిందీ సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో 'ఏంటమ్మా...' పాటకు స్టెప్పులు వేశారు. రీసెంట్‌గా సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.

Continues below advertisement

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie). ఇందులోని ఓ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా స్టెప్పులు వేశారు. 'ఏంటమ్మా... ఏంటమ్మా...' అంటూ సాగే పాటలో తళుక్కుమని మెరిశారు. సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో కలిసి కాలు కదిపారు. 

Continues below advertisement

షర్ట్స్ కలర్ ఎందుకు మారింది?
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'లో హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)ను హైదరాబాదీ అమ్మాయిగా చూపిస్తున్నట్టు తెలిసింది. ఆమెకు అన్నయ్యగా వెంకటేష్ కనిపిస్తారు. అందుకని, సినిమాలో బతుకమ్మ నేపథ్యంలో ఓ పాటను రూపొందించారు. మరో పాటను 'ఏంటమ్మా...' అంటూ స్టార్ట్ చేశారు. తెలుగు నేపథ్యం అంటూ... ఆ పాటల్లో హీరోలు అడ్డబొట్టు పెట్టుకోవడం ఏమిటి? పంచెకట్టు అలా ఉండటం ఏమిటి? అని కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటిని పక్కన పెడితే... 'ఏంటమ్మా' సాంగులో హీరోల షర్ట్స్ కలర్ మారడం గమనించారా?

'ఏంటమ్మా...' సాంగ్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఇటీవల ఆ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అది చూస్తే... షూటింగులో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, వెంకటేష్ కొంచెం కషాయానికి దగ్గర రంగులో షర్ట్స్ వేసుకున్నారు. పాటలో చూస్తే ఎల్లో కలర్ షర్ట్స్ ఉన్నాయి. ఈ కలర్ మార్పు డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఆ మధ్య హిందీ సినిమాలో ఓ పాటలో హీరోయిన్ వేసుకున్న బికినీ రంగు వివాదానికి దారి తీసింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని షర్ట్స్ కలర్ చేంజ్ చేశారా? మరొకటా? అనేది సస్పెన్స్. 

'ఏంటమ్మా...' పాటకు మంచి స్పందన లభిస్తోంది. లుంగీ డ్యాన్స్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు మొన్నటి వరకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వేసిన స్టెప్పులు గుర్తు వస్తాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), మన విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వేసిన స్టెప్పులు గుర్తుకు వస్తాయని చెబితే అతిశయోక్తి కాదు!

Also Read : 'రావణాసుర' రివ్యూ : రవితేజ సినిమా ఎలా ఉందంటే?

ఏప్రిల్ 21న 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమా థియేటర్లలోకి సినిమా రానుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కాటమరాయుడు' సినిమాకు హిందీ రీమేక్ ఇది. పూజా హెగ్డే, వెంకటేష్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. 

బతుకమ్మ పాటకు బుట్ట బొమ్మ ఆట!
ఆల్రెడీ ఈ సినిమాలో 'బతుకమ్మ' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా... తెలుగు లిరిక్స్ హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాశారు. హిందీ లిరిక్స్ షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాశారు. 'బతుకమ్మ' వీడియో సాంగులో బుట్టబొమ్మ పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చక్కగా చేశారు. 

Also Read : మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

Continues below advertisement