Ram Charan's Net Worth: టాలీవుడ్ అగ్ర హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. RRR తర్వాత 'గ్లోబల్ స్టార్' గా మారిన చెర్రీ.. ప్రస్తుతం గేమ్ చేంజర్, RC 16 చిత్రాల్లో నటిస్తున్నారు. నేడు (మార్చి 27) పుట్టిన రోజు కావడంతో, ఆయన ఆస్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రామ్ చరణ్ ఆస్తుల విలువ...
2007లో 'చిరుత'తో హీరోగా తెరంగేట్రం చేసిన కొణిదెల రామ్ చరణ్.. 17 ఏళ్ల సినీ కెరీర్ లో 14 చిత్రాల్లో నటించారు. మగధీర, రంగస్థలం, ఎవడు, ధృవ, ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా ఎదిగారు. దానికి తగ్గట్టుగానే భారీగానే ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తుల నెట్ వాల్యూ 175 మిలియన్ యూఎస్ డాలర్లుగా అంచనా వేయబడిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1387 కోట్లకు సమానంగా పేర్కొనబడింది.
రామ్ చరణ్ సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారానే వస్తోంది. కొన్ని సందర్భాలలో ఆయన తన రెమ్యునరేషన్ తో పాటుగా సినిమాల లాభాల్లో వాటా తీసుకునేలా అగ్రిమెంట్ రాసుకుంటారనే టాక్ కూడా ఉంది. RRR సినిమాలో నటించినందుకు గాను చెర్రీ రూ. 50 కోట్ల వరకూ పారితోషికం తీసుకోగా.. గ్లోబల్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత తన తదుపరి చిత్రాలకు దాదాపు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
2013 నుంచి ఫోర్బ్స్ ఇండియా 100 మంది సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్నారు రామ్ చరణ్. పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీతో సహా దాదాపు 34 ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో యాడ్ కు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.
చెర్రీకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే..?
రామ్ చరణ్ తన భార్య ఉపాసన కామినేనితో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్నాసియం, ఫిష్ పాండ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ బంగళా విలువ రూ. 50 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలానే ముంబైలో చెర్రీకి ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
రామ్ చరణ్ వ్యాపారాలు...
రామ్ చరణ్ కు అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. తన తండ్రి బాటలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ట్రూజెట్ అనే ఎయిర్ లైన్ సంస్థను కూడా కలిగి ఉన్నారు. 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్' (ఐఎస్‌పీఎల్) హైదరాబాద్ జట్టుకు చెర్రీ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.
చరణ్ లగ్జరీ కార్లు...
రామ్ చరణ్ వద్ద రూ. 4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 కార్ ఉంది. అలానే ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో వంటి కాస్ట్లీ కార్లు కూడా కలిగి ఉన్నారు. ఇలా ఎన్నో కోట్ల ఆస్తులు కలిగి ఉన్న చరణ్.. సంపాదనకు తగ్గట్టుగానే ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశంలో అత్యధికంగా టాక్స్ చెల్లించేవారిలో రామ్ చరణ్ ఒకరు. ఆయన తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తూ, తన మంచి మనసును చాటుకుంటున్నారు.
Also Read: ఈసారి రామ్ చరణ్ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే?