Ram Charan Reviews His Latest Movie Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. చరణ్, బుచ్చిబాబు ఒకే కారులో జర్నీ చేస్తూ... మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

చరణ్ రివ్యూ

పెద్దిలో తన రోల్ గురించి మాట్లాడిన చరణ్... మూవీలో కీ పాయింట్ గురించి రివ్యూ ఇచ్చారు. 'సినిమాలో మీకు ఇష్టమైన ఎపిసోడ్ ఏది?' అని డైరెక్టర్ అడగ్గా ఢిల్లీ ఎపిసోడ్ అని చెప్పారు చరణ్. 'ఢిల్లీ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. లాస్ట్ 40 మినిట్స్ అదే పెద్ది కథ. ఎక్కువ ట్విస్టులు ఉండేది ఆ ఎపిసోడ్‌లోనే. అది నా ఫేవరెట్. ఉప్పెనలో క్లైమాక్స్ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది.' అని చెప్పారు. ఢిల్లీ ఎపిసోడ్‌లో చరణ్‌ను చూసి తాను కన్నీళ్లు పెట్టినట్లు తెలిపారు బుచ్చిబాబు.

Continues below advertisement

Also Read : 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

పెద్ది ఇన్‌స్పిరేషనల్ ఎమోషన్

నిజానికి స్టార్ హీరోకు ఈ పాయింట్ చెబుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారోనని అనుకున్నట్లు చెప్పారు బుచ్చిబాబు. 'కథలో అలాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు హీరోయిజం తగ్గుతుందనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ కథలో హీరోయిజం 50 రెట్లు పెరుగుతుంది. పెద్ది అంటే యాక్షన్, రెజ్లింగ్, క్రికెట్ కాదు ఓ ఎమోషన్. చాలా మంది చిన్న చిన్న విషయాలకే డిప్రషన్‌కు వెళ్తారు. ప్రస్తుతం ట్రెండ్‌కు పెద్ది ఓ ఇన్‌స్పిరేషనల్ క్యారెక్టర్. బుక్స్‌లో ఉండాల్సింది.' అని అన్నారు.

క్లైమాక్స్ ఎందుకంత స్పెషల్?

ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే బిగ్ సక్సెస్ అందుకున్నారు బుచ్చిబాబు. ఈ మూవీ క్లైమాక్స్ అందరికీ ఓ షాక్ అనే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇప్పుడు అంతకంటే 100 రెట్లు ఎక్కువగా పెద్ది క్లైమాక్స్ ఉంటుందని చరణ్ చెప్పడంతో హైప్ మామూలుగా లేదు. ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా చరణ్ కనిపించారు. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా సస్పెన్స్ క్రియేట్ చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కాలు లేకుండా గేమ్స్‌లో పాల్గొంటారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. 

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్లైమాక్స్ గురించి బిగ్ ఎలివేషన్ ఇచ్చారు. 'నార్మల్ క్లైమాక్స్ ఉంటే ఎవరూ డిస్కషన్ పెట్టరు. డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటేనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఉప్పెన లానే షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. లాస్ట్ 45 మినిట్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. పెద్ది మిమ్మల్ని నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ఎమోషనల్‌గా ఉంటాడు. మీ హృదయాల్లోకి వచ్చి కూర్చుంటాడు.' అని చెప్పడంతో హైప్ పదింతలు అవుతోంది.

మరో ట్రైలర్ రిలీజ్ చేస్తారా?

పెద్ది ట్రైలర్‌ కట్‌కు కొంత మిక్స్‌డ్ టాక్ రాగా మరో ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక భోపాల్‌లో రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇదే ఈవెంట్‌లో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.