గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie). థియేటర్లలోకి రావడానికి చాలా టైమ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రామ్ చరణ్ పుట్టిన రోజుకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో క్రికెటర్ రోల్‌లో హీరో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన గ్లింప్స్‌కు, చరణ్ హుక్ షాట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే... సినిమాతో థియేటర్లలో దిగకముందే సెంచరీ కొట్టారు చరణ్.
'పెద్ది' ఓటీటీ డీల్ @ 110 కోట్లు ప్లస్!'పెద్ది' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ 110 కోట్ల కంటే ఎక్కువ అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషలలో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అన్ని భాషలకు కలిపి ఓటీటీ డీల్ మాట్లాడారు.
'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ 110 కోట్లు అనేది కేవలం బేస్ ప్రైజ్ మాత్రమే. థియేటర్ల నుంచి వచ్చే కలెక్షన్లు బట్టి ఈ వ్యాల్యూ ఇంకా పెరుగుతుందని టాక్. ఉదాహరణకు తెలుగులో 250 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే ఒక రేటు, హిందీలో 100 కోట్ల కలెక్షన్లు దాటితే ఒక రేటు, 200 కోట్ల కలెక్షన్లు దాటితే మరొక రేటు అనే విధంగా డీల్ సెట్ చేశారట. రూ. 110 కోట్లు అనేది మినిమమ్. థియేటర్లలో హిట్ అయ్యే దాన్నిబట్టి డీల్ వాల్యూ మరింత పెరుగుతుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ తీసుకుంది. ఆ డీల్ వేల్యూ 50 కోట్లు ప్లస్ అని టాక్.
Also Read: సూర్య ఫ్లాప్ సినిమాకు సీన్లు, ఫైట్లు యాడ్ చేస్తే చూస్తారా? 'రెట్రో'ని వదలని కార్తీక్ సుబ్బరాజ్
ప్రస్తుతం 'పెద్ది' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. సెట్స్ నుంచి హీరోతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో ఆయన తాజాగా షేర్ చేశారు.
Also Read: సీక్రెట్‌గా ఉంచాల్సిన విషయాన్ని చెప్పేసిన నాగార్జున - రజనీకాంత్ 'కూలీ' టీమ్ ఏం చేస్తుందో?
రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.