Netizens Reactions Memes On Ram Charan's Peddi Glimpse: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ గ్లింప్స్ కోసమే చర్చ సాగుతోంది. ముఖ్యంగా వీడియోలో చూపించిన చివరి షాట్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో ఇది సిగ్నేచర్ షాట్ అని మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అని చర్చించుకుంటున్నారు.
అప్పుడే మొదలుపెట్టేశారుగా..
పెద్ది మూవీ 'గ్లింప్స్' ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రామ్ చరణ్ మాస్ యాక్షన్, బుచ్చిబాబు మేకింగ్, రెహమాన్ బీజీఎంపై సినీ ప్రియులు, ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో ఫైనల్‌లో వచ్చే సిగ్నేచర్ షాట్‌పై కొందరు.. మొత్తం వీడియోపైనా మరికొందరు భారత క్రికెటర్లతో పోలుస్తూ సరదాగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
క్రికెట్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి బ్యాట్ హ్యాండిల్‌ను నేలపై కొట్టి, బంతిని బలంగా బాదితే అది బౌండరీని దాటే సీన్ గూజ్ బంప్స్ అని.. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తోందని అంటున్నారు. భుజంపై బ్యాట్‌ను తీసుకొస్తూ, బీడీ తాగుతూ తిరుగులేని ఆత్మవిశ్వాసంతో క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టగా.. డిఫరెంట్ యాసతో చెప్పిన డైలాగ్ డెలివరీ సీన్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిందని పేర్కొంటున్నారు.
అలానే ఉందే?
మరికొందరు నెటిజన్లు ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ యాక్షన్‌ను 'దసరా' సినిమాలో నేచురల్ స్టార్ నాని సీన్స్‌తో కంపేర్ చేస్తూ ఓ వీడియో క్రియేట్ చేశారు. 'బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్' అంటూ ఈ వీడియోకు ఓ నెటిజన్ కామెంట్ చేశారు. నిజానికి 'పెద్ది' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలోనూ.. అది 'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దిలా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా.. దీనికి చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగానే కౌంటర్ ఇచ్చారు.
'పెద్ది' మూవీలో రామ్ చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కానుంది.