Ram Charan's First Shot In Peddi Glimpse Goose Bumps: 'పెద్ది' గ్లింప్స్‌లో (Peddi Glimpse) ఆ ఒక్క సీన్ కోసమే 1000 సార్లు చూస్తారు'.. ఇదీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ చెప్పిన మాట. ఆ కామెంట్ నిజం చేస్తూ.. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చరణ్ మాస్ యాక్షన్, డైలాగ్స్ అదిరిపోయాయి.

ఫస్ట్ షాట్.. వేరే లెవల్..

పెద్ది గ్లింప్స్‌ వీడియోలోని క్లైమాక్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. చేతికి ఇసుక రాసుకొని బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో  బ్యాట్ కిందకు కొట్టి ఆవేశంతో ముందుకొచ్చి మరీ బాల్‌ను కొట్టడం నిజంగా వేరే లెవల్ అనేలా ఉంది. 'మాస్ కాస్ట్యూమ్‌లో ఆ లాస్ట్ షాట్ అదుర్స్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ షాక్ కోసం 1000 సార్లు చూడాల్సిందేనని అంటున్నారు. ర‌గ్డ్ లుక్‌, పొడ‌వాటి జుట్టు, గుబురు డ‌డ్డం, ముక్కుకి ధ‌రించిన రింగు ఇవ‌న్నీ క్యారెక్ట‌ర్‌లోని రానెస్‌, పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీని తెలియ‌జేస్తుండగా.. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Also Read: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - నాని 'ప్యారడైజ్' కూడా అప్పుడే.. ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే..

చెర్రీ పవర్ ప్యాక్ట్ ఎంట్రీ..

భారీ జన సమూహం ఉత్సాహంగా కేరింతలు కొడుతుండగా.. అందరూ ఆశర్యపోయేలా డిఫరెంట్ డైలాగ్స్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ ప్యాక్ట్ నిజంగా అదుర్స్ అనేలా ఉంది. భుజంపై బ్యాట్‌ను తీసుకొస్తూ, బీడీ తాగుతూ తిరుగులేని ఆత్మ‌విశ్వాసంతో క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టగా.. డిఫ‌రెంట్ యాస‌తో చెప్పిన డైలాగ్ డెలివ‌రీ సీన్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. చ‌ర‌ణ్ పొలాల్లో ప‌రిగెత్త‌ుతూ వెళ్లి, గోని సంచిని చించి చేతికి చుట్టుకుంటూ, చివ‌ర‌గా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడం. అలాగే క్రికెట్ క్రీజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బ్యాట్ హ్యాండిల్‌ను నేల‌పై కొట్టి, బంతిని బ‌లంగా బాదితే అది బౌండ‌రీని దాటే సీన్ గూజ్ బంప్స్‌ తెప్పిస్తోంది.

జీవితంలో మ‌న‌కు క‌నిపించే పాత్ర‌ను అసాధార‌ణ రీతిలో జీవం పోశారు డైరెక్టర్ బుచ్చిబాబు. సాంకేక‌తంగా, నిర్మాణపరంగా ప్ర‌తీ ఫ్రేమ్‌ అద్భుతంగా క‌నిపిస్తోంది. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌.ర‌త్న‌వేల్ ఒక్కో స‌న్నివేశాన్ని త‌న కెమెరాలో పిక్చ‌రైజేష‌న్ తీరు అద్భుతం. గ్రామీణ నేప‌థ్యం కోసం వేసిన సెట్స్ చూస్తుంటే నిర్మాణప‌రంగా ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌కుండా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో జీవం పోసేలా ఉన్నాయి.

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటించగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కానుంది.