గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇక షూటింగ్‌లో భాగంగా ఆయన దేశవిదేశాలకు ప్రయాణం కావాల్సి ఉంటుంది. అయితే అలా వెళ్లేటప్పుడు రామ్ చరణ్ తన వెంట కుక్కర్‌ను తీసుకెళతారట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కాకపోతే చిన్న ఛేంజ్ రామ్ చరణ్ ఎక్కడికెళ్తే అక్కడికి వెంట ఈ కుక్కర్‌ను తీసుకెళ్ళేది ఆయన సతీమణి ఉపాసన. ఇంత పెద్ద హీరో కదా కుక్కర్‌ను వెంట తీసుకెళ్లడం ఏంటి? కావాలంటే ఓ స్టార్ చెఫ్‌ను పెట్టుకోగలిగే హీరో ఆయన అనుకోవచ్చు. కానీ ఈ కుక్కర్ విషయం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 

కుక్కర్ వెంట తీసుకెళ్లడం వెనుక ఇంత పెద్ద స్టోరీనా !?రెండేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీని ఆస్కార్ అవార్డు  వరించిన విషయం తెలిసిందే. ఈ హిస్టారికల్ మూమెంట్ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు అభిమానులు ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారాన్ని ఇష్టపడతాడు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒక్క పూట అయినా ఇంటి భోజనం తినాల్సిందేనట. లేదంటే ఫుడ్ విషయంలో గ్లోబల్ స్టార్ ఇబ్బంది పడతారట. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందుకే ఆయన సమస్యను తీర్చడానికి మెగా అత్తాకోడళ్ళు ఈ కుక్కర్ ప్లాన్ కనిపెట్టారట. కుక్కర్ ఎందుకంటే హోమ్ ఫుడ్ వండుకోవడానికి. అది కూడా తన తల్లి సురేఖ తయారు చేసిన ఇన్స్టంట్ మిక్స్‌తో. ఇక ఈ ఆలోచన ఓ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాకే దారితీసింది.

కుక్కర్ స్టోరీతోనే ఈ బిజినెస్ ఐడియా   ఇక చరణ్ కష్టాన్ని దూరం చేయడానికి ఆయన తల్లి, మెగాస్టార్ భార్య సురేఖ ఇన్స్టంట్ మిక్స్‌లను తయారు చేయడం మొదలు పెట్టిందట. వాటితో పాటు కుక్కర్ కూడా తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటి ఫుడ్‌ను చరణ్ ఆస్వాదిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఆలోచన 'అత్తమ్మాస్ కిచెన్' బిజినెస్‌ను స్టార్ట్ చేయడానికి నాంది పలికింది. 

ఇక ఇంటికి దూరంగా ఉన్నప్పుడు హోమ్ ఫుడ్ కోసం అల్లాడిపోవడం అన్నది చరణ్ సమస్య మాత్రమే కాదు. ఇంకా ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. నిజానికి బయట తినడం అంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల తరువాత బయట ఫుడ్ అంటే మొహం మొత్తడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ ఇంట్లో వండిన ఫుడ్ పైకి మనసు మల్లుతుంది. ఫుడ్ అనేది ఒక ఎమోషన్ కదా మరి... అలాంటి వారి కోసమే 'అత్తమ్మాస్ కిచెన్' ను స్టార్ట్ చేశారు సురేఖ, ఉపాసన కలిసి. అందులో అచ్చ తెలుగు వంటలకు సంబంధించిన ఇన్స్టంట్ మిక్స్ లను అమ్ముతున్నారు.