'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక గేమ్ ఛేంజర్ మూవీ తో అదే గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ సైతం ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న గేమ్ చేంజర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ని ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోడ్ లో కూడా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది.


నిజానికి గేమ్ ఛేంజర్ షూటింగ్ ని ముగించిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలోనే హీరోయిన్ కియార అద్వానీ వివాహం మరియు చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఇక త్వరలోనే ఉపాసన డెలివరీ కూడా ఉండడంతో రామ్ చరణ్ సినిమాలకు కాస్త విరామం తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీంతో దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు ఈ గ్యాప్ లో నటీనటుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే  బుచ్చిబాబు నటీనటుల ఎంపిక విషయంలో 'ఆర్ ఆర్ ఆర్' ఫార్ములాను ఫాలో అవుతున్నారట. దాని ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' మ్మూవీ కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ శరన్, మకరంద్ దేశ్ పాండే ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను రాజమౌళి ఎంపిక చేసుకున్నాడు.


అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్న సినిమాలోనూ హిందీ, తమిళ, మలయాళ నటీనటులతో పాటు కొంతమంది మరాఠీ థియేటర్, టీవీ ఆర్టిస్టులను కూడా తీసుకుంటున్నారట. త్వరలోనే ఆ నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను మూవీ టీం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి సినిమాకి కూడా రాజమౌళి ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. అప్పుడు అది చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఆ తర్వాత 'ఆర్ ఆర్ ఆర్' కి అదే ఫార్ములా అని అప్లై చేశాడు. ఇక ఇప్పుడు రాజమౌళి రూట్లో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం ఇలాంటి ఫార్ములాను ఫాలో అవ్వడం మొదటిసారి కావడంతో ఈ న్యూస్ తో సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీన్ని బట్టి ఈసారి బుచ్చిబాబు రామ్ చరణ్ తో ఎవరు ఊహించని విధంగా సినిమా తీయబోతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. మరి రామ్ చరణ్ సినిమాతో బుచ్చిబాబు వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకొని బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రేంజ్  ఇంపాక్ట్ ని బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తాడేమో చూడాలి.


Also Read: వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..