పొడుగు కాళ్ళ సుందరి రకుల్ తన తదుపరి సినిమా కోసం చేసిన ఓ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 14 గంటల పాటు నీటి అడుగున ఉంది. అందుకోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రకుల్ ‘ఐ లవ్ యు’ సినిమాలో నటిస్తోంది. అందులో నీటి అడుగున రకుల్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు సీన్ చేసేందుకు నీటి అడుగున ఉండవలసి వచ్చింది. అందుకోసం రకుల్ చాలా కష్టపడింది.
“నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. నీటి లోపల టెన్షన్ పడకూడదు. అందుకోసం నెల రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. స్కూబా శిక్షకుడు అజహాన్ అడేన్ వాలా అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం శిక్షణ ఇచ్చారు. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు నీటి అడుగున పట్టు కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్పించారు. ఈ సీక్వెన్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు చిత్రీకరించారు. పగలు, రాత్రి రెండు సన్నివేశాల కోసం నీటి అడుగున షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను రెండు సెషన్స్ పని చేశాను. రోజంతా నీటిలో ఉండటం అంటే సవాలుతో కూడుకున్న విషయమే. నా శరీరం చల్లబడకుండా ఉండటానికి వాళ్ళు ప్రతి షాట్ గ్యాప్ లో నా మీద వేడి నీళ్ళు పోస్తూ ఉన్నారు. అయితే నీటిలో క్లోరిన్ కారణంగా కళ్ళు మంటలు పుట్టాయి. ఈ ఛాలెంజ్ ని నేను నిజంగా ఆస్వాదించాను. నన్ను నేను ధృడపరుచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడింది. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవడం కోసం శారీరక శిక్షణ తీసుకున్నాను” అని రకుల్ చెప్పుకొచ్చింది.
సుమారు 14 గంటల పాటు రకుల్ నీటి అడుగున ఉండి కష్టపడిందంటే మామూలు విషయం కాదు. "ఐ లవ్ యు" సినిమాలో రకుల్ సరసన పవిల్ గులాటి నటించారు. నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందింది. అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. జియో సినిమాలో జూన్ 16న విడుదల కాబోతుంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ నుండి డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న మూడవ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికంటే ముందు 'ఛత్రివాలి', 'బూ' సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మొదటి సారి బూ సినిమాతో హారర్ జోన్ టచ్ చేసిన రకుల్ మరో థ్రిల్లర్ తో ముందుకు రాబోతుంది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీతో పాటు తమిళంలో 'భారతీయుడు2', 'ఆయాలాన్' సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. వీటిలో 'భారతీయుడు2' షూటింగ్ చివరి దశలో ఉండగా.. 'ఆయాలాన్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
Also Read: ఆ ఫొటోతో మళ్లీ తెరపైకి వచ్చిన నిహారిక విడాకుల అంశం - అది నిజమేనా?