Rakshasa Trailer: ‘రాక్షస’ ట్రైలర్ మాములుగా లేదు... ఈ శివరాత్రికి ఒక్కొక్కరికీ ఉంటది!

Rakshasa Trailer Talk: కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షస’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. శివరాత్రి రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

Continues below advertisement

కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా.. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాక్షస’. మహా శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ.. ఈ ‘రాక్షస’ చిత్ర తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉందంటే..

Continues below advertisement

ఈ ట్రైలర్ స్టార్టింగే ఆసక్తికరంగా మొదలైంది. గన్, బుల్లెట్స్‌ ఉన్న టేబుల్ ముందు కూర్చుని ఉన్న ప్రజ్వల్ దేవరాజ్ ఏదో థింక్ చేస్తున్నట్లుగా చూపించి, వెంటనే ఓ పాపను చూపించారు. ‘నాన్నా’ అని పాప పిలవగానే ప్రజ్వల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ భయానకంగా ఉండటంతో పాటు.. పాప కోసం ఆయన పరుగులు పెట్టే తీరు.. కూతురు‌పై తన ప్రేమను తెలియజేస్తున్నాయి. ‘ఉట్టి నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు.. కూతురుని ఎలా చూసుకోవాలో కూడా తెలిసుండాలి’ అనే డైలాగ్‌తో ఈ సినిమా నేపథ్యం ఏమిటనేది తెలిసిపోతుంది. ఆ డైలాగ్ తర్వాత వచ్చే హారర్ ఎలిమెంట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ముఖ్యంగా టైమ్‌ని చూపిస్తూ.. కంటి రెప్ప పడనీయనంత ఉత్కంఠగా ఈ గ్యాప్‌లో సీన్సు నడిపించారు.

Also Read: రాజమౌళి పోస్ట్‌, మహేష్‌ రిప్లై - పుట్టుకొచ్చిన మీమ్స్‌.. ఇవి చూస్తే నవ్వకుండ ఉండలేరు

‘నువ్వు పుట్టిన తిథి, వారం, నక్షత్రం బట్టి చూస్తే నీ గ్రహాలకి దోషం ఏర్పడినట్లుంది..’ అనే డైలాగ్ అనంతరం ఈ ట్రైలర్ ఉన్న తీరు చూస్తే.. ప్రేక్షకులకు సరికొత్త హారర్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చేలా ఈ చిత్రాన్ని దర్శకుడు లోహిత్ హెచ్ రెడీ చేసినట్లుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రజ్వల్ దేవరాజ్ పాత్రలోని వేరియేషన్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన చర్యలు సినిమాపై ఇంట్రస్ట్‌ని పెంచుతున్నాయి. నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉన్నాయి. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం నుంచి ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్‌ను పెంచగా.. ఈ ట్రైలర్ ఆ బజ్‌ని డబుల్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా చెప్పడంలో ట్రైలర్ సక్సెస్ అయింది.

ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ.. ‘రాక్షస’ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పగలను. ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌కు అంతకుమించిన ఆదరణ దక్కుతోంది. ఈ ట్రైలర్ లానే సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాను. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని.. అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Also Readరామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నాడా... ఇండస్ట్రీ హాట్ న్యూస్, నిజం ఏమిటంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola