Rakshana Indusudan As Draupadi First Look Out Now : రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ డ్రామా 'ద్రౌపది 2'. రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

పవర్ ఫుల్ లుక్

గాంభీర్య, హుందాతనం, కట్టూ బొట్టూ, ఆహార్యం ఇలా పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టారు ఇందుసుదన్. ద్రౌపది దేవినే నేలకు దిగివచ్చిందా? అన్నట్లుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. రిచర్డ్ రిషి, ఇందుసుదన్‌లతో పాటు నట్టి నటరాజ్, వైజీ మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామ్మూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, అరుణోదయన్, దేవయాని శర్మ, సిరాజ్ జానీ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Continues below advertisement

ఈ మూవీకి మోహన్.జి దర్శకత్వం వహిస్తుండగా... నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై చోళ చక్రవర్తి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజువల్స్‌తో రాబోతోంది. 14వ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Also Read : స్మాల్ మూవీ... బిగ్ సక్సెస్ - 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీకి 3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్

ద్రౌపది 2 మూవీ నటీనటులు

బ్యానర్ - నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాత - చోళ చక్రవర్తి, దర్శకుడు - మోహన్ జి, మ్యూజిక్ డైరెక్టర్ - జిబ్రాన్, కెమెరామెన్ - ఫిలిప్ ఆర్ సుందర్, ఎడిటర్ - దేవరాజ్ ఎస్, ఆర్ట్ డైరెక్టర్ - ఎస్‌కే, స్టంట్స్ - యాక్షన్ సంతోష్, డైలాగ్స్ - సామ్రాట్.