Raju Weds Rambai Movie Three Days Box Office Collection : అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన రీసెంట్ కల్ట్ విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్సాఫీస్ వద్ద హిట్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే బిగ్ సక్సెస్ అందుకుంది.
3 రోజుల్లోనే ఊహించని కలెక్షన్స్
ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఫస్ట్ డేనే మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. 3 రోజుల్లోనే రూ.7.28 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.1.47 కోట్లు... రెండు రోజుల్లో రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డేను మించి సెకండ్ డే అలా రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతుండడంతో మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతోంది.త్రానికి దక్కడం విశేషం.
ఈ మూవీలో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ తేజస్వి రావు హీరో హీరోయిన్లుగా నటించారు. చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే శివాజీ రాజా, అనిత చౌదరి, శ్రీరంగం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ విలేజ్‌లో యువతీ యువకుల ప్రేమకథను ఎమోషనల్‌గా డిఫరెంట్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ సాయిలు కంపాటి. ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేశారు.
Also Read : చరిత్ర చూడని వారియర్ 'స్వయంభు' - నిఖిల్ హిస్టారికల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?