'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అని గతంలో పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే చిన్న సినిమా తీసి చూడు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళలా విడుదల చేసి చూడు అని యంగ్ హీరోలు చెబుతున్నారు. పేదలు సొంతిల్లు కట్టడం ఎంత కష్టమో చిన్న హీరోల సినిమా తీసి విడుదల చేయడం కూడా అంతే కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'క' విడుదల సమయంలో కిరణ్ అబ్బవరం, 'ధూం ధాం' విడుదలకు ముందు చేతన్ మద్దినేని, ఇప్పుడు జితేందర్ రెడ్డి కోసం రాకేష్ వర్రే... సినిమా విడుదల కోసం చాలా కష్టాలు పడ్డారని వాళ్ల మాటలను బట్టి అర్థమవుతుంది. 


చిన్న సినిమాలు చేయలేమంటున్న రాకేష్!
రెబల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి', 'బాహుబలి' సినిమాలలో రాకేష్ కీలక పాత్రలు చేశారు. ఆ తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాతో హీరోగానూ విజయం అందుకున్నారు. అయితే హీరోగా మరో సినిమా చేయడానికి ఆయనకు నాలుగేళ్ల సమయం పట్టింది. 'జితేందర్ రెడ్డి' సినిమాతో మరోసారి ఆయన ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా విలేకరుల సమావేశంలో రాకేష్ వర్రే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.



బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరని రాకేష్ వర్రే అంటున్నారు. సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. 'ఎవరికీ చెప్పొద్దు' సినిమా విజయం సాధించడంతో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో తాను పేక మేడలు సినిమా ప్రొడ్యూస్ చేశానని, ఆ సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు పడ్డాను అని ఆయన తెలిపారు.
చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి సెలబ్రిటీలు రారు అని తాజాగా ఏర్పాటు చేసిన 'జితేందర్ రెడ్డి' విలేకరుల సమావేశంలో రాకేష్ వర్రే ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు ఎంతో మందికి తాను మెసేజ్ చేశానని కానీ అటు నుంచి స్పందన లేదని ఆయన తెలిపారు. సెలబ్రిటీలను నమ్ముకోవద్దని ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకువెళ్లే డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను నమ్ముకోమని తోటి ఫిలిం మేకర్లకు రాకేష్ వర్రే సలహా ఇచ్చారు.


Also Read: 'గేమ్ చేంజర్'తో ఇష్యూ లేకుండా రిలీజ్ డేట్ ఫిక్స్... సంక్రాంతికి వస్తున్న వెంకీ మామ



'ఎవరికీ చెప్పొద్దు' సినిమా తీసిన అనుభవంతో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలని పేక మేడలు తీశానని, కానీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు. తనకు ఒక బ్రాండ్ వచ్చిన తరువాత మళ్లీ నిర్మాతగా సినిమాలు చేస్తానని చెప్పారు. 'జితేందర్ రెడ్డి' ప్రేక్షకుల కోసం ఎంతో పోరాడారని చనిపోయిన తన అన్న కోసం ఒక తమ్ముడు సినిమా తీయాలని తన దగ్గర రావడంతో ఈ సినిమా యాక్సెప్ట్ చేశానని, మే నెల నుంచి కష్టాలు పడితే ఇప్పటికి సినిమాను థియేటర్లలోకి తీసుకు రాగలుగుతున్నామని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రెటీలు రావాలంటే వాళ్లకు బోలెడు ఆబ్లిగేషన్స్ ఉంటాయని చెప్పారు. మరి ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Readకేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా